హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీ..ఈ సీక్రెట్ రెసిపి మీకోసమే..ఒట్టి చట్నీనే తినేస్తారు!

Posted By:

దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఏపీ,తెలంగాణలో పొద్దున్నే బ్రేక్ పాస్ట్ లోకి మన ఇళ్లల్లో ఇడ్లీ,దోసె,ఉప్మానే ఎక్కువగా చేస్తుంటారు. ఇక వీటిల్లోకి కొబ్బరి చట్నీ సైడ్ డిష్ గా తయారుచేసేటోళ్లు చాలామంది. అయితే హోటల్స్‌ లో చేసే కొబ్బరి చట్నీ రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఏంటో హోటల్ స్టైల్ రుచి ఇంట్లో చేస్తే రాదు అని అనడం ఇక ఉండనే ఉండదు. ఎందుకంటే ఓ చిన్న సీక్రెట్ తో వాళ్లకంటే మీరే చాలా బాగా చేసేయవచ్చు.

చిన్న సీక్రెట్ తో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వేస్తుంది. చిన్న చిన్న మార్పులే కానీ ఎంతో రుచిని ఇస్తుంది ఈ చట్నీ. ఒట్టి చట్నీలోనే చెంచా వేసుకొని తినేస్తారు. హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీని మించిన టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా ఎలా కొబ్బరి చట్నీ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

hotel style coconut chutney secret recipe in telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు
-కరివేపాకు
-పచ్చిమిర్చి
-వెల్లుల్లి
-అల్లం తరుగు
-ఎండుమిర్చి
-ఆయిల్
-పచ్చిశెనగపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-ఉప్పు

తయారీ విధానం

-1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పును గోరువెచ్చని నీళ్లలో అరగంట సేపు నానబెట్టాలి.

-తర్వాత పచ్చికొబ్బరికాయను ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడగాలి.

-తర్వాత మిక్సీ గిన్నెలో కట్ చేసి కడిగిన కొబ్బరి ముక్కలు, 5 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు,నానబెట్టిన పచ్చి శెనగపప్పు, అర ఇంచు అల్లం తరుగు, 2 రెబ్బల ముదిరిన కరివేపాకు,రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అందులో అర టీస్పూన్ ఆవాలు,అర టీస్పూన్ జీలకర్ర,2 ఎండుమిరపకాయల ముక్కలు,1 రెబ్బ కరివేపాకు వేసి వేయించాలి.

-వేగిన తాళింపుని ఈ మొత్తాన్ని చట్నీలో వేసి కలుపుకోవాలి. అంటే సూపర్ టేస్టీ చట్నీ రెడీ. దీనిని ఇడ్లీ లేదా దోశలతో కలుపుకొని తింటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేరు.

hotel style coconut chutney secret recipe in telugu

కొన్ని ప్రయోజనాలు

కొబ్బరి చట్నీ కేవలం రుచికరంగానే కాకుండా, ఇందులో వాడే పచ్చి కొబ్బరి, ఆవాలు వంటి పదార్థాల వలన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. పచ్చి కొబ్బరిలో పీచు పదార్థం(ఫైబర్) అధికంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, పేగు కదలికలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది.

పచ్చి కొబ్బరిలో రాగి , మెగ్నీషియం , ఐరన్ , పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొద్ది మొత్తంలో విటమిన్ C, ఫోలేట్, థయామిన్ వంటి విటమిన్లు కూడా లభిస్తాయి. ఐరన్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండె సంబంధిత సమస్యలు లేదా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడి సలహా మేరకు తీసుకోవాలి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion