Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
సేమ్యా పాయసంకి ఏ మాత్రం తీసిపోని క్యారెట్ ఖీర్..ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూడండి
క్యారెట్ తో ఏది చేసినా దాని టేస్ట్ అద్భుతమే. క్యారెట్లతో ఫ్రై చేసినా,హల్వా చేసినా, పాయసం చేసినా టేస్ట్ లో ఏ మాత్రం తగ్గుదల ఉండదు. క్యారెట్ పాయసం ఎవ్వరికైనా నచ్చి తీరుతుంది. ఇది రుచికి తియ్యగా, క్రీమీగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో లేదా సాధారణంగా తీపి తినాలనిపించినప్పుడు దీనిని తయారుచేసుకోవచ్చు. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. క్యారెట్ ఖీర్ లేదా క్యారెట్ పాయసం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
క్యారెట్ ఖీర్ తయారీకి కావలసిన పదార్థాలు
క్యారెట్లు - 1 కప్పు
చిక్కటి పాలు - 4 కప్పులు
చక్కెర - 1/2 కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - 1/4 టీస్పూన్
జీడిపప్పు - 10-12
కిస్మిస్ - 1 టేబుల్ స్పూన్
బాదం పప్పు - 10-12
పిస్తా పప్పు - 8-10

క్యారెట్ ఖీర్ తయారీ విధానం
-క్యారెట్ పాయసం తయారుచేయడానికి ముందుగా ముందుగా క్యారెట్లను బాగా కడిగి, వాటి పైనున్న తొక్కను తీసివేసి తురుముకోవాలి.
-తర్వాత ఒక మందపాటి అడుగు కలిగిన గిన్నెను లేదా పాన్ ను స్టవ్ మీద పెట్టి వేడి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో క్యారెట్ తరుము వేసి 5-7 నిమిషాలు వేయించాలి.
-క్యారెట్లు వేగుతున్న సమయంలో మరొక చిన్న పాన్ లో మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేయాలి. అందులో చిన్నగా తురుమిన జీడిపప్పు, బాదం పప్పు ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి.
-జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు బంగారు రంగులోకి మారిన తర్వాత కిస్మిస్ వేసి అవి కూడా కొద్దిగా ఉబ్బే వరకు వేయించాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ ను ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు వేయించిన క్యారెట్ తరుములో పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత గరిటెతో బాగా కలపాలి. మంటను మీడియంలో ఉంచి పాలు పొంగకుండా కలుపుతూ ఉడికించాలి.
-పాలు బాగా మరిగి క్యారెట్లు మెత్తబడే వరకు ఉడికించాలి. దీనికి సుమారు 15-20 నిమిషాలు పట్టవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల ఖీర్ అడుగంటకుండా ఉంటుంది.
కోటీశ్వరులు కూడా కక్కుర్తి పడి తినే రెసిపి ఇదే..ఎలా చేయాలంటే
-క్యారెట్లు పూర్తిగా ఉడికిన తర్వాత చక్కెర వేయాలి. చక్కెర వేసిన తర్వాత ఖీర్ కొద్దిగా పలుచన అవుతుంది. చక్కెర పూర్తిగా కరిగిపోయే వరకు, ఖీర్ కావలసిన చిక్కదనానికి వచ్చే వరకు ఉడికించాలి.
-ఖీర్ చిక్కబడిన తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలపాలి. యాలకుల పొడి వేయడం వల్ల ఖీర్ కు మంచి సువాసన వస్తుంది.
-చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ లను ఖీర్ లో వేసి కలపాలి.
-స్టవ్ ఆఫ్ చేసి క్యారెట్ ఖీర్ ను కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది వేడిగా లేదా చల్లగా అయినా చాలా రుచిగా ఉంటుంది.
-అలంకరణ కోసం పైన కొద్దిగా పిస్తా పప్పు పలుకులు చల్లి సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
