Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
వేసవి సీజన్ లో కొన్ని సీజనల్ పండ్లతో పాటు సీజనల్ ఆకు కూరలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో ఒకటి చింత చిగురు. చింత చిగురు వంటలు ఆంధ్ర తెలంగాణాలో సుపరిచితం. ఈ సీజన్ లో చింత చిగురుతో పప్పు, చట్నీ, చింత చిగురు మటన్, వేపుళ్ళకు , సూప్ లలో విరివిగా ఉపయోగిస్తుంటారు.
చింతచిగురు కాస్త పుల్లగా వగరుగా..కమ్మగా ఉండటంతో ఈ సీజన్లో పల్లెల్లో పట్టనాలలో దొరికే లేలేత మెత్తని చింతచిగురును వంటల్లో ఎక్కువ ఉపయోగిస్తారు. కేవలం రుచికొరకు మాత్రమే కాదు, ఇందులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుండటంతో ఈ సీజన్ లో దొరికే చింత చిగురుతో పప్పును ఎలా తయారుచేసుకోవాలో మీ పరిచయం చేస్తున్నాం. దీన్ని మీరు కూడా ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

కావలసినపదార్థాలు
చింత చిగురు: 1 కప్పు (ముదిరిన చిన్న కడాలను తొలగించి నీళ్ళలో వేసి
శుభ్రం చేసుకోవాలి)
కంది పప్పు: 1 కప్పు
ఉల్లిపాయ 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చి మిరపకాయలు 5 సగానికి కోసుకోవాలి
ఎండు మిరిపకాయలు: 2
వెల్లుల్లి రెబ్బలు 5
పసుపు పొడి: ¼ టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
పోపుకోసం :
జీలకర్ర : 1 టేబుల్ స్పూన్.
ఆవ గింజలు: ½ టేబుల్ స్పూన్
ఉద్దిబ్యాళ్ళు: 1/4 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి : 2 మధ్యలోకి కట్ చేసుకోవాలి
ఎండు మిరపకాయలు: 2 మధ్యలోకి కట్ చేసుకోవాలి
వెల్లుల్లి పాయలు: 3 (పొట్టుతో సహా కచపచా దంచినవి)
కరివేపాకు: 1 రెమ్మ
నూనె : 1 టేబుల్ స్పూన్
చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలి:
1. ముందుగా చింత చిగురు కొన్నప్పుడు లేదా కోసుకొచ్చినప్పుడు కొన్ని
ముదిరిన కాడలు ఉంటాయి. వాటితో పాటు చిన్న చిన్న పుల్లలు కూడా ఉంటాయి.
వీటిని తీసేసి శుభ్రం చేసుకోవాలి
2. తర్వాత నీటిలో వేసి బాగా కడిగి నీరు వంపేసి పక్కన
పెట్టుకోవాలి.
3. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో పైన సూచించిన విధంగా చింత చిగురు,
కంది పప్పు , టమోటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు ,
ఎండు మిరిపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు పొడి, ఉప్పు వేసి
2గ్లాసుల నీళ్ళు పోసి మూత పెట్టి స్టౌ మీద ఉంచాలి
4. 2 లేదా 3 విజిల్స్ లేదా పప్పు మెత్తబడే వరకు ప్రెషర్ కుక్కర్లో
పప్పును ఉడికించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఆవిరి పూర్తిగాపోయాక, మూత తీసి, పప్పు గుత్తితో చక్కగా
పాముకోవాలి.
6. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత
పోపుకు తీసుకున్న జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయ, దంచిన
వెల్లుల్లి మరియు కరివేపాకు జోడించండి.
7. పోపు వేగిన తర్వాత, మెత్తని పప్పు పైన ఈ తడ్కా/పోపును పోసి 5-10
నిమిషాల పాటు మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించండి. అంతే కమ్మని
రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ. దీన్ని ముద్ద లేద అన్నంతో ఒక
టేబుల్ స్పూన్ నెయ్యి తో కలిపి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications