Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జీడిపప్పు కూర ఎప్పుడైనా తిన్నారా? రుచి అద్భుతహః, ఎలా చేసుకోవాలంటే?
మనం తరచుగా జీడిపప్పును ఏదైనా స్వీట్‌లో లేదా ఏదైనా వంటలో వేసుకొని తింటూ ఉంటాము. లేకపోతే ఏదైనా జ్యూస్‌పైనా, ఐస్ క్రీంపైనా చల్లుకొని ఎంజాయ్ చేస్తుంటాము. కానీ మీరు ఎప్పుడైనా జీడిపప్పుతో కూర చేసుకొని తిన్నారా? మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ కూరను తయారు చేసుకొని తింటారు. దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ స్టోరీలో కాజు కర్రీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
జీడిపప్పు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
1 కప్పు జీడిపప్పు
2 ఉల్లిపాయలు
2 టమోటాలు
1 అల్లం వెల్లుల్లి పేస్ట్
1/2 టీస్పూన్ పసుపు
1 టీస్పూన్ కారం
1 టీస్పూన్ ధనియాల పొడి
1/2 టీస్పూన్ గరం మసాలా
రుచికి ఉప్పు
2 టేబుల్ స్పూన్లు నూనె
కొత్తిమీర తరుగు (గార్నిష్ కోసం)

తయారీ విధానం:
- ముందుగా, జీడిపప్పును కొద్దిసేపు నీటిలో నానబెట్టాలి.
- ఉల్లిపాయలను సన్నగా తరిగి, టమోటాలను ముక్కలుగా కోసుకోవాలి.
- ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయాలి.
- అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- అనంతరం టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
- టమాటోలు బాగా వేగాక అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి.
- ఆ తరువాత నానబెట్టిన జీడిపప్పు వేసి కలపాలి.
- ఇప్పుడు తగినంత నీరు పోసి ఉప్పు వేసి కలపాలి.
- కర్రీని మూత పెట్టి, జీడిపప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
- చివరగా, గరం మసాలా వేసి కలపాలి. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించుకుంటే ఎంతో రుచికరమైన జీడిపప్పు కర్రీ సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications