Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అసలు ఆరోగ్యకరమైన వడలు అంటే ఇవే, ఫైబర్, ప్రోటీన్ పుష్కలం.. ఎలా చేసుకోవాలంటే?
పచ్చి బఠాణీలు తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. పచ్చి బఠానీల్లో ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని సుద్ధి చేయడంతో పాటు కండరాల పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పచ్చి బఠానీలతో ఎంతో మేలు జరుగుతుంది. అలాంటి బఠానీలతో వడలు చేసుకునే తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా తినలేని వ్యక్తులు ఇలాంటి వదలను లొట్టలేసుకుని మరీ తినేస్తారు. అయితే ఈ వడలు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పచ్చి బఠానీలతో వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
పచ్చి బఠాణీలు - 1 కప్పు
ఉల్లిపాయలు - 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 2-3 (సన్నగా తరిగినవి)
అల్లం - చిన్న ముక్క (సన్నగా తరిగినది)
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
కరివేపాకు - కొన్ని రెబ్బలు
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం:
- ముందుగా పచ్చి బఠాణీలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
- రుబ్బుకున్న బఠాణీలను ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి, బియ్యప్పిండి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని వడల్లాగా వత్తుకోవాలి.
- ఒక కడాయిలో నూనె వేడి చేసి, వడలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- వేయించిన వడలను టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి తీసుకోవాలి అంతే.
- వేడి వేడి పచ్చి బఠాణీ వడలు సిద్ధమైనట్లే. వాటిని కొబ్బరి చట్నీ లేదా టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
