Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మిగిలిపోయిన అన్నంతో దోశలు..నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలో చూడండి
తెలుగు ఇళ్లల్లో లేదా హోటల్స్ లో అయినా పొద్దున్నే ఉండే బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ లో దోశ ప్రధానమైనది. దోశ చాలామంది ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్. అయితే మీరెప్పుడైనా అన్నం దోశ తిన్నారా? తినకపోతే ఓ సారి తప్పక తిని చూడాల్సిందే. సాధారణంగా రాత్రి మిగిలిపోయిన అన్నంని పొద్దున్నే తాళింపు పెట్టి పులిహోర,టమాటో రైస్ వంటివి మన ఇళ్లల్లో చేస్తుంటారు. అయితే మిగిలిపోయిన అన్నంతో దోశలు కూడా చేసుకోవచ్చు. అది కూడా నిమిషాల్లోనే దీనిని రెడీ చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో అప్పటికప్పుడు దోశ తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మిగిలిన అన్నంతో దోశ తయారీకి కావలసిన పదార్థాలు
-మిగిలిన అన్నం
-పుల్లని పెరుగు
-వంట సోడా
-గోధుమ లేదా మైదా పిండి
-బియ్యం పిండి
-ఉప్పు
-నీళ్లు
-ఆయిల్
-దోశ పెనం

మిగిలిపోయిన అన్నంతో దోశ తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో మిగిలిపోయిన అన్నం 2 కప్పులు, 1 కప్పు పుల్లని పెరుగు, 1 కప్పు గోధుమ పిండి లేదా మైదా పిండి,1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పైనే నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత పిండిలో రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ వంటసోడా, 1 గరిట నీళ్లు పోసి పలుచుగా దోశ పిండిలానే కలుపుకోవాలి.
-బాగా కలిపిన పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి పొంగుతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దానిమీద 4 బొట్లు ఆయిల్ వేసి ఉల్లిపాయ లేదా వంకాయతో బాగా రుద్దండి.
మీరు జన్మలో తినని చికెన్ కర్రీ రసం.. ఒక్కసారి తింటే రుచి అస్సలే మర్చిపోరు! ఎలా చేసుకోవాలంటే?
-పెనం వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి ఒక గరిట పిండి తీసుకొని మరీ పల్చగా కాకుండా మందంగా దోశ పోయండి. పలుచగా పోస్తే ఈ పిండి దోశ సరిగ్గా రాదు కాబట్టి మందంగా పోయాలి.
-దోశను మందంగా స్ప్రెడ్ చేసుకున్నాక దాని అంచుల వెంట,మధ్యలో ఆయిల్ లేదా నెయ్యి చుక్కలు వేసి కాల్చండి. ఇది మామూలు దోశలా వెంటనే కాలదు..కొంచెం సమయం పడుతుంది.
మీడియం మంట మీద నిదానంగా దోశను కాల్చుకున్నాక మరోవైపుకి తిప్పి 1 నిమిషం ఉంచి తీసేయడమే. అంతే అన్నం దోశ రెడీ. దీనిని మీకు నచ్చిన చట్నీతో ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications