Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
నోరూరించే నెల్లూరు ఫేమస్ రెసిపి..సమ్మర్ లో తింటే సమ్మగా ఉంటది,ఎలా చేయాలంటే
మలై కాజా ఒక ప్రసిద్ధ స్వీట్. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో దీనిని ఎక్కువగా తయారుచేస్తారు. పిల్లలు,పెద్దలు అన్ని వయస్సుల వారు ఇష్టపడే స్వీట్ ఇది. అయితే మలై కాజా పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది నెల్లూరు మాత్రమే. నెల్లూరులో చేసే మలై కాజా టేస్ట్ దేశంలో ఏ ప్రాంతంలో దీన్ని తిన్నా రాదు. నెల్లూరు వాసులు చాలా ఇష్టంగా తినే మలై కాజాని అదే స్టైల్ లో మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
మలై కాజా తయారీకి కావలసిన పదార్థాలు
మైదా పిండి: 2 కప్పులు
పచ్చికోవా: అరకప్పు
నెయ్యి: 1/4 కప్పు
పాలు: 1/2 కప్పు
చక్కెర: 1 కప్పు
నీరు: 1/2 కప్పు
యాలకుల పొడి: 1/2 టీస్పూన్
బేకింగ్ సోడా: చిటికెడు
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత

తయారీ విధానం
-ముందుగా మైదా పిండిలో నెయ్యితో పాటు పచ్చికోవా వేసి బాగా కలపాలి.
-కలుపుకునేటప్పుడు పాలు పోసి మెత్తని పిండి ముద్దలా చేసుకోవాలి.
-పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని బాదూషా ఆకారంలో ఒత్తుకోవాలి.
-ఒక పాన్ లో చక్కెర, నీరు వేసి పాకం తయారుచేసుకోవాలి.
-పాకం కొద్దిగా చిక్కబడిన తర్వాత అందులో యాలకుల పొడి వేసి కలపాలి.
-ఇప్పుడు కాజాలను నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-వేయించిన కాజాలను చక్కెర పాకంలో వేసి కొన్ని నిమిషాల పాటు నాననివ్వాలి. అంతే నోరూరించే మలై కాజా రెడీ. చల్లారిన తర్వాత మలై కాజాను సర్వ్ చేసుకోవడమే.
గుజరాత్,మహారాష్ట్ర స్పెషల్ రెసిపి..ఇది తినే వారికన్ని తెలివితేటలు,ఎలా చేయాలంటే
ఆరోగ్య ప్రయోజనాలు
మలై కాజా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మలై కాజాలో కాల్షియం ఉండి ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications