Latest Updates
-
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.!
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.!
పప్పు, సాంబార్ లేనిదే ఎవరికైనా ముద్ద దిగదు. ఎన్ని కూరలు ఉన్నా చివరిలో వాటితో తింటేనే పొట్ట తేలికగా ఉంటుంది. అరుగుదల సాఫీగా అవుతుంది. పప్పు రెగ్యులర్ రుచితోనే ఉంటుంది. ఇక, సాంబార్ చేయాలంటే కొంచెం పెద్ద ప్రాసెస్. కానీ ఎప్పుడైనా మన హైదరాబాద్ స్టైల్ ఖట్టీ దాల్ ట్రై చేశారా.. సాంబార్ కంటే డబుల్ రుచితో వేళ్లు జుర్రుకుంటూ తినేలా చేసే ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేయొచ్చు.

హైదరాబాద్ ఖట్టీ దాల్ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు
చింతపండు- 50 గ్రాములు
కందిపప్పు- కప్పు
టమాటాలు- నాలుగు
పచ్చిమిర్చి- నాలుగు
కారం- ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్- టేబుల్
స్పూన్
నీళ్లు- మూడున్నర కప్పులు
నూనె- ఏడు టేబుల్ స్పూన్లు
ఆవాలు- టీస్పూన్
ఎండు మిర్చి- మూడు
జీలకర్ర- అర టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు- పదిహేను
కొత్తిమీర- కొద్దిగా
హైదరాబాద్ ఖట్టీ దాల్ తయారీ విధానం
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.!
ముందుగా కందిపప్పును కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. చింతపండును కడిగి కొన్ని నీళ్లు పోసి నానబెట్టండి.
కంది పప్పు నానిన తర్వాత మందపాటి కుక్కర్ తీసుకుని అందులో పప్పు, పొడవుగా, సన్నగా కట్ చేసిన టమాటాలు, ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీస్పూన్ నూనె, నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి గరిటెతో వీలైనంత వరకు మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుపోసి కావాల్సినన్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.!
తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, ఎండు మిర్చి వేసి వేగాక జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేగిన తర్వాత ఉడికించిన పప్పు వేసి పొంగు రానివ్వాలి. పొంగు వచ్చిన తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
సింపుల్ అండ్ టేస్టీ హైదరాబాద్ ఖట్టీ దాల్ రెడీ. ఇందులో నూనె ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. రెగ్యులర్ పప్పు కంటే రుచిగా, సాంబార్ కంటే అద్భుతంగా ఉండే ఈ వంటకాన్ని తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
