Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
హోటల్ స్టైల్ ‘పొడి ఇడ్లీ’ ఇంట్లోనే.. ఇలా చేసుకొని తింటే, నా సామిరంగా టేస్ట్ అదిరిపోతుందంతే!
మసాలా ఇడ్లీ, తవా ఇడ్లీ, కారం ఇడ్లీ, ఘీ ఇడ్లీ ఇలా ఎన్నో రకాల ఇడ్లీలు తినే ఉంటారు. కానీ ఎప్పుడైనా హోటల్ స్టైల్‌లో పొడి ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? మిగిలిపోయిన ఇడ్లీలతో చేసే ఈ పొడి ఇడ్లీ రుచి అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి వాటిపై కొంచెం నెయ్యి తగిలించి తింటే ఆ రుచి ఇంకా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇది చదువుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదూ. అయితే ఈ ఇడ్లీని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పొడి ఇడ్లీ చేయడానికి కావలసిన పదార్థాలు:
మిగిలిపోయిన ఇడ్లీలు (చిన్న ముక్కలుగా కోసినవి)
నూనె
ఆవాలు
మినపప్పు
కరివేపాకు
పప్పుల పొడి (ధాల్, చనాలు మొదలైనవి)
సన్నగా తరిగిన కొత్తిమీర
రుచికి తగినంత ఉప్పు
రుచికి తగినంత కారం

తయారీ విధానం:
ముందుగా ఒక పాన్‌ను స్టవ్‌పైన పెట్టుకోవాలి. ఆ పాన్ వేడెక్కిన తరువాత దానిపై నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక దానిపై ఆవాలు వేసుకోవాలి. ఆ తరువాత మినపప్పు, కరివేపాకులు కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకున్న ఇడ్లీలు వేసుకోవాలి.
ఇడ్లీలు బాగా ఫ్రై అయ్యాక.. ఆ ఇడ్లీల ఫ్రైతో పప్పుల పొడి, రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే పొడి ఇడ్లీ సిద్ధమైనట్లే. వీటిని ఓ ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పొడి ఇడ్లీ సిద్ధమైనట్లే. దీనిపై ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే.. నా సామిరంగా నాలుక లాపలపలాడాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
