Latest Updates
-
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.!
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా!
మన వంటగదుల్లో ఉండే ముఖ్యమైన పదార్థాలలో బెల్లం ఒకటి. శతాబ్దాలుగా బెల్లం మన వంటగదుల్లోని పదార్థాల్లో భాగంగా ఉంది. పొద్దున తాగే టీ దగ్గరి నుంచి, పండుగలకు చేసుకునే పరమాన్నం, పాయసం, హల్వా, ఎన్నో రకాల సాంప్రదాయ స్వీట్ల వరకు బెల్లం లేనిదే మనకు రుచించదు. పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు.
అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే బెల్లం అంతా స్వచ్ఛమైనదేనా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. ఆకర్షణీయమైన రంగు కోసం, ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం రసాయనాలు కలుపుతున్నారనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. మరి కల్తీ లేని, స్వచ్ఛమైన బెల్లం కావాలంటే ఏం చేయాలి? చాలా సులభం..కొంచెం ఓపిక ఉంటే చాలు కల్తీకి తావులేని స్వచ్ఛమైన బెల్లాన్ని మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా పదార్థాలు కానీ, ఖర్చు కానీ అవసరం లేదు.

బెల్లం తయారీకి కావలసిన పదార్థాలు
చెరకు రసం
కొద్దిగా నెయ్యి
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు!
బెల్లం తయారీ విధానం
-ముందుగా మీరు తెచ్చుకున్న తాజా చెరకు రసాన్ని ఒక సన్నని జల్లెడ లేదా శుభ్రమైన పల్చటి కాటన్ వస్త్రంతో వడకట్టండి. ఇలా చేయడం వల్ల చెరకు రసంలో ఉండే చిన్నచిన్న నలకలు, మట్టి లేదా ఇతర మలినాలు పూర్తిగా తొలగిపోతాయి.
-ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక పెద్ద గిన్నె లేదా ఇత్తడి పాత్రను తీసుకుని అందులో వడకట్టిన చెరకు రసాన్ని పోయాలి.
-స్టవ్ వెలిగించి సన్నని మంట మీద రసాన్ని ఉడికించడం ప్రారంభించండి. చెరకు రసం వేడెక్కుతున్న కొద్దీ పైన ఒక పొరలాగా నురుగు ఏర్పడుతుంది. అందులో చెరకుకు సంబంధించిన సహజ మలినాలు ఉంటాయి కాబట్టి ఒక గరిటెతో ఆ నురుగును ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. మంటను తక్కువగానే ఉంచి, అడుగు అంటకుండా గరిటెతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి.
-కొద్దిసేపటికి చెరకు రసం క్రమంగా చిక్కబడి, అందమైన బంగారు గోధుమ రంగులోకి మారుతుంది. రసం బాగా చిక్కబడి, బెల్లం ముదురు పాకం లాంటి కన్సిస్టెన్సీకి వచ్చిన వెంటనే స్టవ్ ఆపేయండి.
-ఒక స్టీలు పళ్ళెం, ట్రే లేదా మీకు నచ్చిన ఆకారంలో ఉండే అచ్చులను తీసుకుని, వాటికి కొద్దిగా నెయ్యి రాయండి. వేడిగా ఉన్న ఈ బెల్లం మిశ్రమాన్ని అందులో పోసి కాసేపు చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత అది గట్టిగా మారుతుంది.
-అంతే కల్తీ లేని స్వచ్ఛమైన బెల్లం రెడీ. దానిని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
