Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
Famous dessert recipe: నార్త్ ఇండియా ఫేమస్ డెజర్ట్ ఇదే..సమ్మర్ లో తింటే అదిరిపోతుంది,ఎలా చేయాలంటే
నార్త్ ఇండియాలో చాలా పాపులర్ డెజర్ట్ లలో రబ్డీ(Rabdi) ఒకటి. ఇది పాలును చాలా సేపు మరిగించడం ద్వారా తయారుచేస్తారు. దీనిని సాధారణంగా యాలకులు, కుంకుమ పువ్వు, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో అలంకరిస్తారు. రబ్డీ తన ప్రత్యేకమైన రుచి కారణంగా చాలా మందికి ఇష్టమైన స్వీట్ గా మారిపోతుంది. దీనిని నేరుగా తినవచ్చు లేదా గులాబ్ జామున్, జలేబీ, మాల్పువా వంటి ఇతర స్వీట్లతో కలిపి ఆస్వాదించవచ్చు. రబ్డీని ఇంట్లొనే ఈజీగా తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రబ్డీ తయారీకి కావలసిన పదార్థాలు
పాలు - 1 లీటరు (ఫుల్ ఫ్యాట్ పాలు)
చక్కెర - 4-5 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - 1/4 టీ స్పూన్
కుంకుమ పువ్వు
బాదం
పిస్తా
జీడిపప్పు
రబ్డీ తయారీ విధానం
-ముందుగా అడుగు మందంగా ఉండే గిన్నె లేదా కడాయి స్టవ్ మీద పెట్టి అందులో పాలు పోసి మీడియం మంట మీద మరిగించండి. పాలు పొంగి రాకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
-పాలు మరుగుతున్నప్పుడు దానిపై మీగడ (cream) ఏర్పడుతుంది. దానిని గరిటెతో తీసి గిన్నె అంచులకు అంటించండి.
-మంటను తగ్గించి పాలను నెమ్మదిగా మరిగించడం కొనసాగించండి. పాలు వాటి అసలు పరిమాణంలో సగానికి లేదా మూడవ వంతుకు వచ్చే వరకు మరిగించాలి. ఇందుకు సుమారు 45 నిమిషాల నుండి 1 గంట వరకు పట్టవచ్చు.
-పాలు చిక్కబడిన తర్వాత చక్కెర వేసి పూర్తిగా కరిగిపోయే వరకు మరిగించండి.
-తర్వాత అందులో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపండి. కుంకుమ పువ్వు రంగు, సువాసన రబ్డీకి వస్తాయి.
-చివరగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, జీడిపప్పు వేసి కలపండి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ కోసం ఉంచవచ్చు.
-రబ్డీ కావలసిన చిక్కదనానికి వచ్చిన తర్వాత మంటను ఆపివేయండి. అది చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది.
-రబ్డీని పూర్తిగా చల్లారనివ్వండి, ఆపై ఫ్రిజ్‌లో కనీసం 2-3 గంటలు ఉంచండి. చల్లగా తింటే రబ్డీ మరింత రుచిగా ఉంటుంది.
- తినే ముందు మిగిలిన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











