Butter naan: రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్..ఇంట్లోనే సింపుల్ గా పెనం మీద ఇలా చేసుకోవచ్చు

Posted By:

బటర్ నాన్ అంటే ఇష్టం లేనివాళ్లు ఎవరూ ఉండరు. కాజు గ్రేవీతో బటర్ నాన్ తింటే ఆ టేస్ట్ నోట్లో ఏడాది ఉంటుంది అని చెప్తుంటారు. ఒక్కసారి కాజు గ్రేవీతో బటర్ నాన్ తిన్నారంటే మళ్లీ మళ్లీ అదే తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే రెస్టారెంట్ లో తినే నాన్ టేస్ట్ ఇంట్లో చేసుకునేవాటికి రాదని చాలామంది అనుకుంటారు. దీనికి కారణం ఇంట్లో చేసుకోవాలంటే బటర్ నాన్​ని కాల్చడానికి తందూర్ కావాలి..అదంతా చాలా ప్రాసెస్​ తో కూడుకున్నదిగా భావిస్తారు.

అయితే మన ఇంట్లో ఉండే దోశెల పెనం మీదనే రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ ని ఈజీగా చేసుకోవచ్చు. బటర్ నాన్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

బటర్ నాన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మైదాపిండి
-చక్కెర
-ఉప్పు
-ఆయిల్
-పెరుగు
-బటర్

బటర్ నాన్ తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు మైదాపిండి,పావుకప్పు పెరుగు,అర చెంచా బేకింగ్ సోడా,అర చెంచా చక్కెర,అర చెంచా ఉప్పు వేసి బాగా కలిపి తర్వాత కొంచెం నీళ్లు పోసి పిండి కొంచెం జిగురు జిగురుగా ఉండేలా కలుపుకోవాలి.

-తర్వాత కలుపుకున్న పిండిమీద కొంచెం ఆయిల్ వేసి మళ్లీ కొద్దిసేపు వత్తుకోండి.

-ఇప్పుడు వత్తుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పక్కనపెట్టుకోండి.

-తర్వాత ఓ ప్లేట్ తీసుకొని దానిమీద పొడి మైదా పిండి కొంచెం చల్లి దానిమీద ఉండలుగా చేసుకున్నవాటిని పెట్టుకోండి.

-తర్వాత ఆ పిండిముద్దలపై కొంచెం ఆయిల్ వేసి ఓ తడిగుడ్డను వాటిమీద కప్పి అరగంట సేపు అట్ల వదిలేయండి.

-తర్వాత ప్లేట్ మీద తడిగుడ్డను తీసేసి ఓ బండమీద పొడి పిండి కొంచెం చల్లి పిండిముద్ద దానిమీద పెట్టి కొంచెం స్ప్రెడ్ చేసి తర్వాత ఒకచేతిలోనుంచి మరో చేతిలోకి మార్చుకుంటూ తడుతూ ఉండండి లేదంటే అప్పడాల కర్రతో రోల్ చేయండి. నాన్ షేప్ కోసం దాన ఒక ఎడ్జ్ ని కొంచెం సాగదియ్యండి.

-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడెక్కిన తర్వాత తయారుచేసుకున్న నాన్ కి ఓవైపు కొంచెం నీళ్లతో తడిచేసుకుని పెనంమీద వేయండి. రెండు వైపులా నాన్ ని బాగా కాల్చుకోండి.

-కాలిన తర్వాత నాన్ ని పెనంమీద నుంచి తీసి వెంటనే వేడిగా ఉన్నప్పుడే దానికి కరిగిన బటర్ ని అప్లై చేస్తే టేస్టీ బటర్ నాన్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, December 14, 2024, 16:03 [IST]
Desktop Bottom Promotion