Latest Updates
-
ఈ 4 వ్యక్తులకు మీ ఇంటి గుట్టు అస్సలు చెప్పకండి! -
Headline for Deeplink -
ఈ రోజు గురు పౌర్ణమి.. మీ ప్రియమైన గురువులకు ఇలా విషెస్ తెలియజేయండి.! -
సూర్యుని నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి ‘ప్రేమ’ కష్టాలు తప్పవు.! -
పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే గోబీ మసాలా.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మీ అరచేతిలో V ఆకారం ఉందా? 35 ఏళ్ల తర్వాత మీరు ఊహించని విధంగా లైఫ్! -
2030 నాటికి హెపటైటిస్ వైరస్ నిర్మూలనే లక్ష్యం.. కానీ లివర్ ఆరోగ్యానికి ముందున్న సవాళ్లు ఇవే.! -
కాసింత ఘాటుగా, కొంచెం వేడిగా.. ఈ సూప్‌ను రోజుకోసారి తాగారంటే ఇట్టే బరువు తగ్గొచ్చు.! -
గుత్తి వంకాయ కర్రీ అంటే ఎర్రగానే ఉండాలా.. పచ్చికారంతో ఇలా చేస్తే దానికి మించిన రుచి ఉండదు.! -
మీ బాత్రూమ్లో ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. డబ్బు కష్టాలు తొలగినట్లే.!
దూదిలాంటి మెత్తని రాగి రొట్టెలు..ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు, అస్సలు విరిగిపోవు!
ప్రస్తుత బిజీ లైఫ్ లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. అందుకే, చాలామంది రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే సంప్రదాయ ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో ముఖ్యమైనది రాగి రొట్టె. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఒక వరప్రసాదం లాంటివి.
అయితే రాగి రొట్టె చేయాలనుకున్నప్పుడు చాలామంది గృహిణులు ఎదుర్కొనే ప్రధాన సమస్య.. పిండి ముద్ద గట్టిపడిపోవడం లేదా రొట్టెను చపాతీ కర్రతో ఒత్తుతున్నప్పుడు ముక్కలైపోవడం. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీ రాగి రొట్టెలు కూడా గోధుమ పిండి పుల్కాల్లా మెత్తగా, పొరలు పొరలుగా వస్తాయి. దూదిలాంటి మెత్తని రాగి రొట్టెలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు
నీళ్లు - 1 కప్పు
నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
ఉప్పు -సరిపడా
రాగి రొట్టె తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని పోసి వేడి చేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి వేయాలి. నీటిలో నూనె వేయడం వల్ల రొట్టెలు ఎక్కువ సేపు మెత్తగా ఉంటాయి.
-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడే, మంటను తగ్గించి లేదా స్టవ్ ఆపేసి వెంటనే రాగి పిండిని ఆ వేడి నీటిలో వేయాలి. ఒక గరిటె లేదా విస్క్ సహాయంతో పిండిని నీటిలో బాగా కలిపాక గిన్నెపై మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
-పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దానిని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుని చేతితో బాగా మర్దన చేస్తూ కలపాలి. ఎంత బాగా పిసికితే రొట్టె అంత మృదువుగా వస్తుంది. అవసరమైతే చేతికి కొంచెం నూనె రాసుకుని మృదువైన ముద్దలా తయారు చేసుకోండి.
-ఇప్పుడు పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. పొడి రాగి పిండిని లేదా గోధుమ పిండిని చల్లుకుంటూ, చపాతీ కర్రతో మెల్లగా గుండ్రంగా ఒత్తుకోవాలి. పిండిని వేడి నీటిలో కలిపాం కాబట్టి, అంచులు పగలకుండా రొట్టె చక్కగా వస్తుంది.
-స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కాక, ఒత్తుకున్న రొట్టెను వేయాలి. ఒక వైపు చిన్న బుడగలు రాగానే మరోవైపు తిప్పాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత, మెత్తటి గుడ్డతో అంచుల వెంబడి ఒత్తితే రొట్టె పొంగుతుంది. లేదా నేరుగా స్టవ్ మంటపై పుల్కాలాగే కాల్చుకుంటే బంతిలా ఉబ్బుతుంది
-చివరగా కొంచెం నెయ్యి రాస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
-రాగి రొట్టెలను పప్పు, పల్లీల చట్నీ, వంకాయ కూర లేదా ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కలిపి తింటే ఆ రుచే వేరు. మధ్యాహ్నం లంచ్ బాక్సులోకి కూడా ఇవి చాలా మెత్తగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications