Latest Updates
-
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.?
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.!
వరలక్ష్మీ వ్రతం లేదా శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం సమర్పించడం తప్పనిసరి. కానీ కొన్నిసార్లు పరమాన్నం గట్టిపడుతుంది. మరికొన్నిసార్లు పాలు విరిగిపోతాయి. దీంతో బెల్లపు పరమాన్నం రుచి మారిపోతుంది. అయితే ఇలా అవ్వకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తూ బెల్లపు పరమాన్నాన్ని జ్యూసీగా, టేస్టీగా చేసుకోవచ్చు. బెల్లపు పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం..

బెల్లపు పరమాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం- కప్పు
శనగపప్పు- పావు కప్పు
తాజా పాలు- నాలుగు కప్పులు
నీళ్లు- రెండు కప్పులు
బెల్లం- రెండు కప్పులు
నెయ్యి- నాలుగు టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి ముక్కలు- రెండు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు పలుకులు- రెండు టేబుల్ స్పూన్లు
ఎండు ద్రాక్ష- టీస్పూన్
ఏలకుల పొడి- అర టీస్పూన్
పచ్చకర్పూరం- కొద్దిగా
జాజికాయ పొడి- కొద్దిగా
బెల్లపు పరమాన్నం తయారీ విధానం..
బెల్లపు పరమాన్నం తయారీ కోసం ముందుగా కుక్కర్‌లో బియ్యం, శనగపప్పు వేసి రెండు సార్లు కడగాలి. ఇప్పుడు ఇందులో రెండు కప్పుల తాజా పాలు, రెండు కప్పుల నీళ్లు పోసి అరగంట పాటు నాననివ్వాలి.
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.!
తర్వాత ఇప్పుడు కుక్కర్‌లో మధ్యలో చిన్న బౌల్ పెట్టుకుని మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
ఈ లోపు స్టవ్‌పైన మరో బౌల్ పెట్టుకుని అందులో బెల్లం ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇందులో పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేవరకు కాగనివ్వాలి.

కుక్కర్ మూత తీసి ఉడికిన అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి. గిన్నెలోకి చేరిన పాలతో పాటు, మిగిలిన పాలు మరికాసిన్ని నీళ్లు పోసి కలియతిప్పాలి. స్టవ్ ఆన్ చేసి దీనిని కాసేపు ఉడికించాలి.
ఇప్పుడు చల్లారిన బెల్లం పానకాన్ని ఈ అన్నంలో వేసి మెల్లగా కలుపుతూ ఉడికించాలి.
ఈ లోపు స్టవ్‌పైన మరో చిన్న బాణలి పెట్టుకుని నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు పలుకులు వేసి ఒకదాని తర్వాత ఒకటి వేయించాలి. చివరిగా ఎండు ద్రాక్ష వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పరమాన్నంలో కలుపుకోవాలి.
ఇప్పుడు ఏలకుల పొడి, పచ్చకర్పూరం, జాజికాయ పొడి వేసి కలపాలి. బెల్లపు పరమాన్నాన్ని అడుగంటకుండా కలుపుతూ ఉంచి కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే జ్యూసీ బెల్లపు పరమాన్నం రెడీ. ఈ విధానంలో చేయడం ద్వారా పరమాన్నం గట్టిపడదు. పాలు విరిగిపోవు. ఈ వరలక్ష్మీ వ్రతానికి ఈ ప్రసాదం రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
