Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్‌ను ఎలా తయారు చేసుకోవాలి..?
మైసూర్ పాక్ కొరికగానే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. కొన్ని మైసూర్ పాక్‌లు చాలా గట్టిగా వుంటాయ్. ఎంత గట్టిగా కొరికిగా విరగవు, మరికొన్ని చాలా మెత్తగా వుంటాయ్. మామూలు కిరాణా షుపుల్లో కూడా రూ.5 కి ఒక మైసూర్ పాక్ చొప్పున అమ్ముతుంటారు. అదే స్వీట్ షాపుల్లో అయితే ఒక్క మైసూర్ పాక్ కనీసం 15 నుంచి 20 రూపాయలు వుంటుంది. అయితే కమ్మని, నోరూరించే మైసూర్ పాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మైసూర్ పాక్ తయారు చేయడానికి ఒక బౌల్‌లో ఒక జెల్లెడ పెట్టుకొని అందులో ఒక కప్పు చెనగపిండి వేసుకొని జెల్లడ పట్టాలి. ఇలా చేయడం వల్ల చెనగపిండి ముద్దలు ముద్దలుగా రాకుండా వుంటుంది. ఇదే జెల్లెడలోకి ఒక అరకప్పు మిల్క్ పౌడర్‌ను తీసుకోవాలి. ఇలా మైసూర్ పాక్‌లో మిల్క్ పౌడర్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మిల్క్ పౌడర్ లేకపోతే మిల్క్ పైడర్‌కు బదులుగా మైదాపిండిని వేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ పిండిలో అర కప్పు నెయ్యిని కొంచెం కొంచెం తీసుకుంటూ బాగా కలపాలి. లూస్ పేస్ట్ వచ్చేలా కలుపుకోవాలి. తరువాత ఒక ప్యాన్‌ను స్టవ్ పై పెట్టుకొని ఆ ప్యాన్‌లో రెండు కప్పుల చెక్కరను వేసుకోవాలి. ఇందులో అరకప్పు నీళ్లను పోసుకొని చెక్కరను బాగా కరిగించాలి. పాకం బాగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని బాగా కలుపుకోవాలి.
ఈ పాకంలో కలిపిపెట్టిన చెనగపిండిని తీసుకొని కలపాలి. ముందుగానే చెనకపిండిలో నెయ్యి వెయ్యడం వల్ల పాకంలో చెనగపిండి ముద్దలు కట్టకుండా వుంటుంది. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాకాన్ని ఇంకా బాగా ఉడికించాలి. ఇందులో ఒక అరకప్పు నెయ్యిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకోవాలి.
మళ్లీ ఒక అరకప్పు వరకు నెయ్యిని తీసుకొని కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు ఒక కప్పు, పాకంలో కలుపుకునేటప్పుడు ఒకటిన్నర కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మొత్తం రెండున్నర నుంచి మూడు కప్పుల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మైసూర్ పాక్‌కు నెయ్యి ఎలా కలిసిందో ఒక సారి చెక్ చేసుకోవాలి. కలుపుకున్న పాకం పిండిని చిటికెడంత చేతిలోకి తీసుకున్న తరువాత సులభంగా ఉండకట్టాలి. అలా ఉండకట్టినప్పుడే నెయ్యి, పిండి బాగా కలిసిందని అర్ధం చేసుకోవచ్చు.
ఒక బ్రెడ్ మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యిని అద్దుకోవాలి. మైసూర్ పాక్ బ్రెడ్ మౌల్డ్ కు అతుక్కోకుండా వుండటానికి ఇలా చేస్తాం. ఇది మొత్తం చల్లారేంతవరకు చూడాలి. రెండు గంటల పాటు ఈ బ్రెడ్ మౌల్డ్‌ను అలాగే వదిలివేయాలి. రెండు గంటల తరువాత బ్రెడ్ మౌల్డ్ లోంచి మైసూర్ పాక్‌ను బయటకు తీయాలి. ఇక ఈ మైసూర్ పాక్‌ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీసస్ కరెక్ట్‌గా నీటిగా వచ్చేలా కట్ చేసుకోవాలి. మంచి పదునైన వంట కత్తితో కట్ చేయాలి. సమాన భాగాలుగా మైసూర్ పాక్‌ను కట్ చేసుకోవాలి. ఇత దీంతో టేస్టీ నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ రెడీ అయినట్టే. సాయంత్రం స్నాక్‌లాగా పడుకునే ముందు కూడా తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications