Latest Updates
-
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!
Vankaya Bajji: స్ట్రీట్ స్టైల్ వంకాయ బజ్జీ..కొరికి కొరికి తినేస్తారు, ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
బజ్జీలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సాయంత్రం పూట చల్లటి వాతావరణంలో బజ్జీలు తినాలని అనిపించకపోతేనే తప్పు. అయితే మీరెప్పుడైనా వంకాయ బజ్జీని ట్రై చేశారా? దేశంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వంకాయ బజ్జీలను సాయంత్రం సమయంలో స్నాక్ గా తయారుచేసి అమ్ముతుంటారు. అయితే ఏపీలో స్ట్రీట్ స్టైల్ లో తయారుచేసే వంకాయబజ్జీల టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏపీలోని గుంటూరు పేరు వింటే చాలామంది ఫుడ్ లవర్స్ కి అక్కడ స్పెషల్ గా తయారుచేసే వంకాయ బజ్జీలు గుర్తుకొస్తాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వంకాయ బజ్జీ అంటే గూంటూరులో చేసిందే అని అంటుంటారు. ఈ వంకాయ బజ్జీని ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. వంకాయ బజ్జీని తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

వంకాయ బజ్జీ తయారీకి కావలసిన పదార్థాలు
-శెనగపిండి
-ఉప్పు
-పసుపు
-వంట సోడా
-వాము పొడి
-వంకాయలు
-జీలకర్ర
-కరివేపాకు
-చింతపండు
-వెల్లుల్లి
-పల్లీలు
-ఎండుమిర్చి
-నిమ్మరసం
-కారం
-పెరుగు
-వాము పొడి
-ఉల్లిపాయ
-కొత్తిమీర తరుగు
వంకాయ బజ్జీ తయారీ విధానం
-ఓ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శెనగపిండి,రుచికి సరిపడా ఉప్పు,పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ వంట సోడా,నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కొద్దిగా జారుడుగా కలుపుకోండి. బాగా పలుచగా కాకుండా,బాగా గట్టిగా కాకుండా మీడియంగా పిండిని కలుపుకోవాలి.
-కలిపిన పిండిలో అర టీస్పూన్ వాము పొడి వేసి బాగా కలిపి మూతపెట్టి పావుగంట సేపు పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు 10 పొడవైన వంకాయలను నాలుగు ముక్కలుగా మధ్యలోకి చీల్చుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసి అందులో ఈ వంకాయలను వేసి వేయించుకోవాలి.
-వంకాయలు లైట్ గా మెత్తబడిన తర్వాత వంకాయలను తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకప్పు పల్లీలు వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. పల్లీలు వేగాక అందులో 5 ఎండుమిర్చి ,అర టీస్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి సన్నటి సెగ మీద వేయించి పూర్తిగా చల్లారనిచ్చాక వీటిని మిక్సీ గిన్నెలో వేయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, 1 వెల్లుల్లి రెబ్బ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత ఈ పల్లీల పొడిని ముందుగా వేయించుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేశాక ఇప్పుడు ఒక్కో వంకాయను ముందుగా కలిపి పెట్టుకున్న శెనగపిండి మిశ్రమంలో ముంచి ఆయిల్ లో వేసి వేయించి దించేయాలి. అంతే వంకాయ బజ్జీ రెడీ.
-తర్వాత ఓ గిన్నెలో పావు కప్పు నిమ్మరసం, ఒకటిన్నర టీస్పూన్ కారం వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి.
-తర్వాత మరో గిన్నెలో పెరుగు తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొద్దగా వాము పొడి వేసి బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు వంకాయ బజ్జీలను మధ్యలోకి కట్ చేసి అందులో కొత్తిమీర తరుగు, నిమ్మరసం కారం,పెరుగు,కొన్ని పల్లీలు వేస్తే అసలు సిసలైన స్ట్రీట్ స్టైల్ వంకాయ బజ్జీ రెడీ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
