Latest Updates
-
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా..
ఇలాంటి చికెన్ కర్రీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు, అబ్బా అసలైన రుచి అంటే ఇదే, ఎలా చేసుకోవాలంటే?
మన దేశంలో ఆహారానికి కొదువే ఉండదు. కొన్ని దేశాల్లో కొన్ని రకాల ఆహారపదార్థాలు మాత్రమే ఉంటాయి. కానీ మన దగ్గర అలా కాదు. రాష్ట్రానికి కొన్ని వందల రకాల వంటకాలు ఉంటాయి. తెలంగాణలో కొన్ని రకాల వంటలు ఫేమస్ అయితే.. ఆంధ్రాలో కొన్ని రకాల వంటలు చాలా ఫేమస్. మాంసాన్ని తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వేరే విధంగా తింటే, మరికొన్ని ప్రాంతాల్లో వేరే విధంగా వండుకొని తింటారు. ఇలా రకరకాల వంటకాలు చేసుకుంటూ రుచితో ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఉంటారు.
అయితే తెలంగాణలో చికెన్‌తో కొన్ని రకాల వంటకాలు చేసుకుంటారు. చికెన్ కూర, ఫ్రై, తందూరి మాత్రమే కాకుండా.. కుండ చికెన్ కూడా చేసుకుంటారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ వంటకం అనేది చాలా ఫేమస్. ఎంతో ఇష్టంగా ప్రజలు దీనిని చేసుకొని తింటుంటారు. అయితే పట్టణాల్లో ఉంటున్న వ్యక్తులకు ఆ కుండ చికెన్ ఎలా చేసుకోవాలో తెలియదు. వాటి రుచిని కూడా టేస్ట్ చేసి ఉండరు. అందుకే ఈ స్టోరీలో.. కుండా చికెన్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా దీనిని చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.

కుండ చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు:
చికెన్: 1 కిలో
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
టమోటాలు: 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
పసుపు: 1/2 టీస్పూన్
కారం: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: 1/2 టీస్పూన్
నూనె: 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిష్ కోసం
కుండ చికెన్ తయారీ విధానం:
మట్టి కుండను బాగా కడిగి, ఆరబెట్టండి.
కుండలో నూనె వేసి వేడి చేయండి.
ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
టమోటాలు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా
కలపండి.
చికెన్ ముక్కలు వేసి మసాలా బాగా పట్టేలా కలపండి.
కుండ మూత పెట్టి, తక్కువ మంట మీద 30-40 నిమిషాలు ఉడికించండి.
చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా
సర్వ్ చేయండి.
చిట్కాలు:
చికెన్ ముక్కలు సమానంగా ఉడికేలా చూడటానికి, వాటిని ఒకే పరిమాణంలో
కోయండి.
మసాలా బాగా పట్టడానికి, చికెన్ ముక్కలను 30 నిమిషాల పాటు మ్యారినేట్
చేయండి.
కుండ చికెన్ ను వండేటపుడు కుండ పగలకుండా ఉండాలంటే, వండే ముందు కుండని
నీటిలో కొన్ని గంటలపాటు నానబెట్టండి.
మీరు మీ రుచికి తగినట్లుగా మసాలాల పరిమాణాన్ని మార్చుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
కుండ చికెన్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాల
నిర్మాణానికి సహాయపడుతుంది.
ఇందులో విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని
పెంచడానికి సహాయపడతాయి.
మట్టి కుండలో వండడం వల్ల, ఆహారంలోని పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ వంటకం తక్కువ నూనెతో వండటం వలన ఆరోగ్యానికి మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
