For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిబిక్యూ చికెన్ క్రీసెంట్ రోల్స్

|

అపిటైజర్ ని పార్టీల్లో ఇంకా డిన్నర్ ముందు స్నాక్ లాగా అందరూ ఇష్టపడతారు. మరి ఆలస్యం దేనికి? చికెన్ చంద్రవంకలు ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం రండి.

కావలసిన పదార్థాలు:
క్రేసెంట్ డిన్నర్ రోల్స్ (ఫ్రిజ్ లో ఉంచినవి) - 1 క్యాన్ (220 గ్రా)
ఒరిజినల్ బార్బెక్యు సాస్ 1/4 కప్ తో చికెన్ ముక్కలు (510 గ్రా)
చెడ్దర్ చీజ్ (ముక్కలు) - 1/4 కప్పు (30 గ్రా)
సన్నగా తరిగిన గ్రీన్ ఆనియన్- 1 టేబుల్ స్పూన్ (6 గ్రా)

How to Make BBQ Chicken Crescents

తయారు చేసే విధానం:
1. ఓవెన్ ని 375° F (190° C)కి సెట్ చేసుకోండి. బేకింగ్ పేపర్ ని పరచి గానీ లేకా నూనె పూసి గానీ బేకింగ్ షీట్ ని సిద్ధం చేసుకోండి.
2. ఒక చిన్న గిన్నె లో చికెన్, చీజ్, ఉల్లి ని కలుపుకోండి. అవరమనుకుంటే చికెన్ ని ఇంకా చిన్న ముక్కలు గా తరగండి.
3. ముద్దని రెండు రెక్టాంగల్స్ గా విభజించుకోండి. (రెండు చంద్రవంక ట్రయాంగల్స్ కలిపితే ఒక రెక్టాంగల్ అవుతుంది ). ట్రయాంగల్స్ ని కలిపి నొక్కిపెట్టండి. అలానే ఇంకో భాగాన్ని కుడా. పిట్జా కట్టర్ ఉపయోగించి ఒక్కో రెక్టాంగల్ ని ఆరు స్క్వేర్లు గా (2.5 ఇంచిలు / 6.35 సెం.మీ పరిమాణం) కోయండి.
4. ఒక్కో స్క్వేర్ మధ్యలో ఒక టీ స్పూను చికెన్ మిశ్రమాన్ని ఉంచండి.
5. ఒక్కో స్క్వేర్ ని మధ్యలో మడిచి ట్రయాంగల్స్ గా తయారుచేయండి. చంద్రవంక చివరలని నొక్కిపెట్టండి లేదా మాములుగా మడిచినా సరిపోతుంది. ఒక్కో ట్రయాంగల్ ని పైన పొడిచి ఆవిరి పోవటానికి వీలుగా రంధ్రం చేసి , బేకింగ్ షీట్ పైన ఉంచండి.
6. ఎర్ర గా దోరగా వచ్చేట్టుగా సుమారు 9 నించి 12 నిమిషాలు దాకా బేక్ చేసుకోవాలి. బ్లూ చీజ్ డ్రెస్సింగ్ తో వేడి వేడిగా వడ్డించండి.

చిట్కాలు:
1. చికెన్ మిశ్రమం మిగిలినట్లయితే మెత్తని ఫజితాలు గానీ, టాకోస్ గానీ, క్యాసెరోలు గానీ చేసుకోడానికి ఉపయోగించుకోవచ్చు.
2. ఇదే విధంగా చికెన్ బదులు బీఫ్ , పోర్క్ ఉపయోగించి వాడీ కూడా చంద్రవంకలు తయారుచేసుకోవచ్చు.

కావలసిన వస్తువులు:
చిన్న గిన్నె
పిట్జా కట్టర్
టీ స్పూన్
బేకింగ్ షీట్ (ట్రే), బేకింగ్ పేపర్ (అవసరమనుకుంటే)

English summary

How to Make BBQ Chicken Crescents | చికెన్ చంద్రవంకలు

Appetizers can spark up any event, whether it's a party or a simple snack before dinner. Why not try BBQ chicken wrapped in crescent rolls? Here's how to make them.
Story first published: Saturday, January 12, 2013, 17:26 [IST]
Desktop Bottom Promotion