For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Motichur Laddu: ఈ రక్షాబంధన్ కు మోతీచూర్ లడ్డూ ఇలా చేయండి

గుమగుమలాడే మోతీచూర్ లడ్డూ తయారీ విధానం. రక్షాబంధన్ రోజూ మీ సోదరులకు పెట్టి చూడండి

|

Motichur Laddu: లడ్డూలందూ మోతీచూర్ లడ్డూ వేరయా.. దాని రుచి అద్భుతమయా.. విశ్వదాభిరామ లడ్డూ తినరా మామ. మోతీచూర్ లడ్డూ తింటే కవితలు ఇలాగే తన్నుకు వస్తాయి. దాని రుచి ముందు మిగతా స్వీట్లు అన్నీ దిగదుడుపే. ఆ రేంజ్ లో ఉంటుంది మోతీచూర్ లడ్డూ.

Motichur Laddu Recipe in Telugu : Raksha Bandhan Special Sweet

ఈ రక్షాబంధన్ కు ఇలా మోతీచూర్ లడ్డూ చేసి మీ సోదరులకు పెట్టి చూడండి. లొట్టలేసుకు తినేస్తారు.

Motichur Laddu Recipe in Telugu : Raksha Bandhan Special Sweet

మోతీచూర్ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు:

* శెనగ పిండి - 2 కప్పులు
* కొద్దిగా ఫుడ్ కలర్
* పంచదార - 2 కప్పులు
* కొంచెం యాలకుల పొడి
* నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
* నూనె
* బాదం
* పిస్తా
* కాజు

Motichur Laddu Recipe in Telugu : Raksha Bandhan Special Sweet

మోతీచూర్ లడ్డూ తయారీ విధానం:

1.
ఒక బౌల్ లో శెనగపిండి వేసుకుని, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. తర్వాత నీళ్లు పోసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చిక్కగా ఉండేలా కలుపుకోవాలి. తర్వాత వేరే బాండీ తీసుకుని అందులో నూనె పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత బూందీ తీసుకోవాలి. సన్నని రంధ్రాలు ఉన్న బూందీ జారా నుండి మాత్రమే బూందీ తీసుకోవాలి. బూందీ మంచి రంగు వచ్చాక తీసేసుకోవాలి.

Motichur Laddu Recipe in Telugu : Raksha Bandhan Special Sweet

2.

తర్వాత మరో గిన్నెలో నీళ్లు పోసుకుని తర్వాత చక్కెర వేసి గులాబ్ జామూన్ కు ఉన్నట్లుగా పాకం తయారు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకోవాలి. అందులో బూందీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకులు పొడి, బాదం, పిస్తా, నెయ్యి వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో గట్టిగా నొక్కుతూ లడ్డూలు తయారు చేసుకోవాలి.

Motichur Laddu Recipe in Telugu : Raksha Bandhan Special Sweet

అంతే గుమగుమలాడే మోతీచూర్ లడ్డూ తయారైనట్లే. రక్షాబంధన్ రోజూ మీ సోదరులకు పెట్టి చూడండి.

English summary

Motichur Laddu Recipe in Telugu : Raksha Bandhan Special Sweet

read on to know Motichur Laddu Recipe in Telugu : Raksha Bandhan Special Sweet
Desktop Bottom Promotion