For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Schezwan Chicken Lollipop: షెజ్వాన్ చికెన్ లాలీపప్, రుచి అద్భుతః

ఎన్ని మిగతా నాన్ వెజ్ ఐటెమ్స్ ఉన్నా.. చికెన్ రేంజ్ చికెన్ దే. నోరూరించే వంటకాల్లో షెజ్వాన్ చికెన్ లాలీపాప్ డిష్ ఒకటి.

|

Schezwan Chicken Lollipop: చికెన్ తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఎన్ని మిగతా నాన్ వెజ్ ఐటెమ్స్ ఉన్నా.. చికెన్ రేంజ్ చికెన్ దే. ఇప్పుడు మనం షెజ్వాన్ చికెన్ లాలీపాప్ డిష్ ఇప్పుడు ట్రై చేద్దాం. దీనిని చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. షెజ్వాన్ చికెన్ లాలీపాప్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Schezwan Chicken Lollipop : How to make delicious Schezwan chicken lollipop in Telugu

కావాల్సిన పదార్థాలు:

* 0.5 కేజీ చికెన్
* రెండు కోడి గుడ్లు
* ఉల్లిపాయలు
* షేజ్వాన్ సాస్
* సోయా సాస్

Schezwan Chicken Lollipop : How to make delicious Schezwan chicken lollipop in Telugu

* మిర్చి సాస్
* అల్లం
* ఉప్పు
* వెల్లుల్లి పేస్ట్
* మైదా పిండి
* బియ్యం పిండి
* జొన్న పిండి
* సన్నగా తరిగిన వెల్లుల్లి
* పచ్చి మిర్చి
* నూనె

Schezwan Chicken Lollipop : How to make delicious Schezwan chicken lollipop in Telugu

షెజ్వాన్ చికెన్ లాలీపాప్ తయారీ విధానం:

1.
అర కిలో చికెన్ లెగ్ పీస్ లు తీసుకుని వాటిని మంచిగా శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మరోసారి శుభ్రం చేసుకోవాలి. ఒక బౌల్ లో అల్లం వెల్లుల్లి పేస్టు, సోయా సాస్, మిర్చి సాస్, రెడ్ చిల్లీ సాస్, కారం, వేసుకుని చక్కగా కలుపుకోవాలి. సాస్ లు అన్నీ చికెన్ పీసులకు మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత షేజ్వాన్ సాస్ వేసుకుని కలిపి కాసేపు పక్కన పెట్టాలి.

Schezwan Chicken Lollipop : How to make delicious Schezwan chicken lollipop in Telugu

2.
ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమంలో గుడ్డు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వా మైదా పిండి, బియ్యపు పిండి వేసి మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.

Schezwan Chicken Lollipop : How to make delicious Schezwan chicken lollipop in Telugu

3.
ఒక పాన్ తీసుకుని నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. బాగా వేడిక్కిన నూనెలో ముందుకు సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలను వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

Schezwan Chicken Lollipop : How to make delicious Schezwan chicken lollipop in Telugu

4.
మరో పాన్ తీసుకుని నూనే వేడి చేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చి మిర్చి వేయుంచుకోవాలి. తర్వాత అదులోనే గ్రీన్ చిల్లీ సాస్, షేజ్వాన్ సాస్, కొన్ని నీళ్లు వేసి మరిగించుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని అందులో వేసుకుని కలుపుకుంటే ఆ మిశ్రమం చిక్కగా అవుతుంది.

Schezwan Chicken Lollipop : How to make delicious Schezwan chicken lollipop in Telugu

5.
ముందుగా నూనెలో వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్ ముక్కలను అందులో వేసుకుని కలుపుకోవాలి. ఆ మిశ్రమం అంతా చికెన్ ముక్కలకు పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

అంతే షేజ్వాన్ చికెన్ లాలీపాప్ సిద్ధం అయినట్టే. సన్నగా తరిగిన కొత్తిమీరను చికెన్ పీసులపై గార్నిష్ చేసుకుంటే షేజ్వాన్ చికెన్ లాలీపాప్ రెడీ టు ఈట్.

English summary

Schezwan Chicken Lollipop : How to make delicious Schezwan chicken lollipop in Telugu

read on to know Schezwan Chicken Lollipop : How to make delicious Schezwan chicken lollipop in Telugu
Desktop Bottom Promotion