For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sweet Corn Chat: స్వీట్ కార్న్ చాట్ ఇలా చేయండి

స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండే స్నాక్. ఇది తయారు చేయడం సులభమే కాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది. స్వీట్ కార్న్, చాట్ మసాలా, ఉల్లిపాయలు, టొమాటోలు కొన్ని ఇతర ప్యాంట్రీ స్టేపుల్స్‌తో చేసిన కార్న్ చాట్.

|

Sweet Corn Chat: స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండే స్నాక్. ఇది తయారు చేయడం సులభమే కాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది. స్వీట్ కార్న్, చాట్ మసాలా, ఉల్లిపాయలు, టొమాటోలు కొన్ని ఇతర ప్యాంట్రీ స్టేపుల్స్‌తో చేసిన కార్న్ చాట్.

Sweet corn chat recipe making in Telugu

ఈ మొక్కజొన్న చాట్ ఆరోగ్యకరమైన, పోషకమైన, హోం స్టైల్ స్నాక్. ఇది ఎటువంటి ఫ్యాన్సీ పదార్థాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఉడికించిన మొక్కజొన్న సిద్ధంగా ఉంటే కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ చాట్‌కు ప్రోటీన్‌ని పనీర్ ముక్కలతో చాట్‌ని అలంకరించవచ్చు.

Sweet corn chat recipe making in Telugu

స్వీట్ కార్న్ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

* స్వీట్ కార్న్ - 2 కప్పులు
* ఉల్లిపాయలు - 2
* టొమాటో - 3
* పచ్చిమిర్చి - 1
* కొత్తిమీర - కొన్ని
* చాట్ మసాలా పొడి - 1/2 టేబుల్ స్పూన్
* జీలకర్ర పొడి - 1/4 టేబుల్ స్పూన్
* కారం - 1/4 టేబుల్ స్పూన్
* నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - తగినంత
* నూనె లేదా బట్టర్ - 1 టేబుల్ స్పూన్

Sweet corn chat recipe making in Telugu

స్వీట్ కార్న్ తయారీ విధానం:

1. తాజా స్వీట్ కార్న్ తీసుకోవాలి. తర్వాత మొక్కజొన్న గింజలను ఒలవాలి.

2. వాటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వేసి నీరు పోసి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. లేదా టేబుల్ స్పూన్ నూనెలో లేత మొక్కజొన్న గింజలను వేయించవచ్చు.

3. మొక్కజొన్న గింజలు చక్కగా ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత నీటిని వడపోసుకోవాలి.

4. మొక్కజొన్న గింజలను ఒక గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు, కారం, చాట్ మసాలా, జీలకర్ర చల్లుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

5. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టొమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

6. తర్వాత వాటిని ప్లేట్లలో సర్వ్ చేసుకోవడమే.

Read more about: recipe వంటకం
English summary

Sweet corn chat recipe making in Telugu

read on to know Sweet corn chat recipe making in Telugu
Story first published:Wednesday, December 14, 2022, 18:05 [IST]
Desktop Bottom Promotion