Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రాగి రవ్వ దోస హెల్తీ బ్రేక్ ఫాస్ట్ క్యాలరీలు తక్కువ ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ..!!
Instant Ragi Rava Dosa రోజూ ఒకే రకమైన దోస తిని విసెగెత్తిపోయారా? అయితే వరైటీగా రాగి రవ్వ దోస ట్రై చేయండి. ఎప్పుడు రాగి రొట్టి, రాగి గంజి, ప్లెయిన్ రాగి దోస తినుంటారు. అయితే ఈరోజు క్రీస్పీగా రాగి రవ్వదోస ప్రయత్నించండి . ఈ రాగిరవ్వ దోస మీ నోటికి డిఫరెంట్ రుచిని అందివ్వడమే కాదు, ఆరోగ్యకరమైనది. ఉదయం అల్పాహారంగా దీన్ని తీసుకోవడానికి కారణం దీనిలో ప్రోటీన్లు ఎక్కువ, క్యాలరీలు తక్కువ.
మనం ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే ఈ రాగి రవ్వ దోస చాలా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైనది. ఈ అల్పాహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. దీనికి కొబ్బరి చట్నీ, సాంబార్చ టొమాటో చట్నీతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది.

Image Courtesy: vismaifoods
రాగి రవ్వ దోస ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? రాగి రవ్వ దోస కోసం ఒక సాధారణ వంటకం క్రింద ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావాల్సిన పదార్థాలు:
* రాగుల పిండి - 1 కప్పు
* గోధుమ పిండి - 1/4 కప్పు
* రవ్వ - 1/4 కప్పు
* ఉప్పు - రుచికి సరిపడా
* జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
* మిరియాల పొడి - 1/2 టేబుల్ స్పూన్
* ఇంగువ - చిటికెడు
* పల్చగా ఉన్న మజ్జిగ - పిండి కలుపుకోవడానికి సరిపడా
* జీలకర్ర - 1/2 tsp
* పచ్చిమిర్చి - 1 (సన్నగా తరిగినవి)
* అల్లం - చిన్న ముక్క (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినవి)
* కరివేపాకు - కొద్దిగా (సన్నగా తరిగినవి)
* ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి)
* వెన్న లేదా నూనె - కొద్దిగా
తయారుచేయు విధానం:
* ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ముందుగా రాగి పిండి తర్వాత
మిగిలిన అన్ని పదార్థాలను వేసి చేత్తో అన్ని పదార్థాలను బాగా మిక్స్
చేయాలి.
* ఉప్పు సరి చూసుకుని కావాల్సిపడితే జోడించాలి తర్వాత పల్చటి మజ్జిగ
పోసుకుంటే పిండిని దోసె పిండిలా పల్చగా ఉండలు లేకుండా పిండిలా
కలుపుకుని మూతపెట్టి 15 నిమిషాలు నాననివ్వాలి.
* 15 నిమిషాల తర్వాత మూత తెరిచి మొత్త మిశ్రమాన్ని మరోసారి
కలుపుకోవాలి.
* పిండి మరీ చిక్కగా ఉంటే అందులో నీళ్లు పోసి బాగా కలిపి రవ్వ దోసెలా
చేసుకోవాలి.
*చివరగా స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి, అందులో కలిపిన పిండిని
పోసి, నూనె వేసి మీడియం మంట మీద ఉడికించి, రెండు వైపులా
కాల్చుకోవాలి.
* అంతే క్రిస్పీగా, రుచికరమైన రాగి రవ్వ దోసె రెడీ. దీన్ని కొబ్బరి
చట్నీ, సాంబార్, టమోటో చట్నీతో వడ్డికస్తే చాలా టేస్ట్ గా
ఉంటుంది.
Image Courtesy: vismaifoods
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
