Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నోట్లో వేస్తే కరిగిపోయేంత మృదువైన సగ్గుబియ్యం రసమలై
రసమలై పేరు వినగానే మన నోట్లో నీళ్లూరుతాయి. అయితే సంప్రదాయ రసమలై తయారీకి కాస్త సమయం, శ్రమ పడుతుంది. అలాంటి వారికోసం, కొత్త రుచులను ప్రయత్నించాలనుకునే వారికోసం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమే సగ్గుబియ్యం రసమలై.
సగ్గుబియ్యంతో చేసిన ఈ రసమలై రుచిలో అచ్చం అసలు రసమలైకి ఏమాత్రం తీసిపోదు. సగ్గుబియ్యం రసమలై ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం- అర కప్పు
పంచదార - 2 టేబుల్ స్పూన్లు
పాలు - 2-3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - పావు టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
చిక్కటి పాలు (ఫుల్ క్రీం మిల్క్) - 1 లీటరు
పంచదార - అర కప్పు
కుంకుమపువ్వు - చిటికెడు
యాలకుల పొడి - అర టీస్పూన్
బాదం, పిస్తా- 2-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు -చిటికెడు
తయారీ విధానం
-ముందుగా సగ్గుబియ్యాన్ని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి కనీసం 3-4 గంటల పాటు నానబెట్టాలి.
-నానిన తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసి కలుపుతూ ఉండాలి.
-కొద్ది నిమిషాల్లోనే సగ్గుబియ్యం పారదర్శకంగా మారి, దగ్గరగా ముద్దలా అవుతుంది. ఈ మిశ్రమం పాన్ నుండి వేరవుతున్నప్పుడు యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, చిన్న చిన్న ఉండలుగా తీసుకుని అరచేతిలో పెట్టి రసమలై ఆకారంలో వత్తుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో లీటరు పాలు పోసి మీడియం మంట మీద వేడిచేయాలి. పాలు ఒక పొంగు వచ్చాక మంటను తగ్గించి, పాలు సగం అయ్యేంత వరకు మరిగించాలి. సుమారు 25-30 నిమిషాలు పట్టవచ్చు.
-పాలు మరిగేటప్పుడు గిన్నె అంచులకు పేరుకునే మీగడను గరిటెతో తీసి పాలల్లోనే కలుపుతూ ఉండాలి. దీనివల్ల రబ్డీ చిక్కగా, రుచిగా తయారవుతుంది.
-పాలు బాగా చిక్కబడిన తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి, కుంకుమపువ్వు నానబెట్టిన పాలు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.
-చక్కెర పూర్తిగా కరిగే వరకు మరో 5 నిమిషాలు చిన్న మంటపై మరిగించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులలో కొన్నింటిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-తయారు చేసుకున్న పాల రసం (రబ్డీ) కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు సిద్ధం చేసుకున్న సగ్గుబియ్యం ఉండలను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. గిన్నెపై మూత పెట్టి కనీసం 4-5 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. రాత్రంతా నానబెడితే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.
-తినే ముందు మిగిలిన బాదం, పిస్తా పలుకులతో అలంకరించాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications