Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
కాకరకాయ ఉల్లికారం..ఒక్కసారి ఇలా చేశారంటే అమృతం టేస్ట్
కాకరకాయ పేరు వింటేనే చాలామంది ముఖం తిప్పేసుకుంటారు. ఇంట్లో కాకరకాయ కూర చేశారంటే ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుందని,తింటే అంత రుచిగా ఉండదని అనుకుంటారు. కానీ సరిగ్గా వండితే ఇతర కర్రీల కంటే కాకర కాయ రుచి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా చేదుగా ఉండే కాకరకాయలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతుంటారు. కాకరకాయ ఉల్లి కారం ఒక్కసారి తిన్నారంటే ఆ టేస్ట్ జన్మలో మర్చిపోరు. వేడి అన్నం,పప్పు చారు,రసం ఇలా దేనితోనైనా తింటే చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం చూడండి.
కాకరకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన
పదార్థాలు
-కాకరకాయ
-ఉల్లిపాయ
-నూనె
-ఉప్పు
-పసుపు
-కారం
-జీలకర్ర
-వెల్లుల్లి
కాకరకాయ ఉల్లికారం తయారీ విధానం
-ముందుగా 400 గ్రాముల లేత కాకరకాయలను తీసుకొని వాటిపైన చెక్కు తీసుకోండి. తర్వాత కాకరకాయ తల,తోక కట్ చేసి కాకరకాయని రెండు ఇంచు ముక్కలుగా కట్ చేసి ఓ బౌల్ లో వేసుకోండి.
-ఇప్పుడు కాకరకాయ ముక్కలలో 1 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు వేసి బాగా పట్టించి అరగంట సేపు పక్కన ఉంచండి.
-అరగంట తర్వాత కాకరకాయల్లో నుంచి నీరు అంతా దిగుతుంది. అప్పుడు ఒక్కో కాకరకాయను బాగా చేతులోకి తీసుకొని పిండితే అందులోని మిగిలిన చేదు కూడా పోతుంది. అలా పిండిన తర్వాత ఆ ముక్కలను పక్కన ఓ ప్లేట్ లో పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో పెద్దగా కట్ చేసిన పావు కిలో ఉల్లిపాయలు,8 వెల్లుల్లి రెబ్బలు,1 టీస్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం,కొంచెం ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి పావు కప్పు ఆయిల్ పోసి అది కొంచెం వేడయ్యాక అందులో కాకరకాయ ముక్కలను వేసి 5-6 నిమిషాలు వేపుకోండి.
-తర్వాత కాకరకాయ ముక్కలను ఓ ప్లేట్ లోకి తీసుకొని వాటిల్లోని గింజలను తీసేసి మిక్సీలో వేసి చేసుకున్న మిశ్రమాన్ని కాకరకాయ ముక్కల్లో స్టఫ్ గా చేసుకోండి.
-ఇప్పుడు కాకరకాయలు వేపుకున్న నూనెలోనే మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేయండి. మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ ని కూడా అందులో వేసి మీడియం ప్లేమ్ మీద 20 నిమిషాలు వేపుకోవాలి.
-దింపే ముందు కొంచెం కరివేపాకు చల్లుకోండి. అంతే కరివేపాకు ఉల్లిపాయ కారం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












