Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
కాఫీ, టీలు పక్కన పెట్టండి..ఉదయాన్నే ఈ గంజి తాగితే ఏనుగు అంత బలం!
ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే వేడివేడిగా టీ లేదా కాఫీ తాగడం మనలో చాలామందికి అలవాటు. కానీ ఆ అలవాటును పక్కనపెట్టి తమిళనాడు ఫేమస్ కట్టుయానం బియ్యం గంజిని మీ దినచర్యలో భాగం చేసుకుంటే, మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. తమిళంలో కట్టు అంటే అడవి, యానం అంటే ఏనుగు అని అర్థం.
అడవిలో ఏనుగు ఎంత బలంగా ఉంటుందో, ఈ బియ్యం తింటే మనిషికి అంతటి బలం చేకూరుతుందని పెద్దల నమ్మకం. అంతేకాదు ఈ పంట పొలాల్లో ఏనుగు ఎత్తులో ఏపుగా పెరుగుతుంది. ఇది ఎర్ర బియ్యం రకానికి చెందినది, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కట్టుయానం బియ్యంతో హెల్దీ గంజిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్ఠాలు
-కట్టుయానం బియ్యం
-నీరు
-చిన్న ఉల్లిపాయ
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-పెరుగు
-ఇంగువ
-ఉప్పు
తయారీ విధానం
-ముందుగా కట్టుయానం బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీడలో లేదా ఎండలో ఆరబెట్టాలి. తేమ పోయిన తర్వాత మిక్సీలో రవ్వలా బరకగా పొడి చేసుకోవాలి.
-రెడీ చేసుకున్న రవ్వను కుక్కర్ లో వేసి, తగినంత నీరు పోసి 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన అన్నంలో మరికొన్ని నీళ్లు, రెండు రెమ్మల కరివేపాకు వేసి రాత్రంతా అలానే ఉంచాలి.
-మరుసటి రోజు ఉదయం మిక్సీలో చిన్న ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమానికి పెరుగు, చిటికెడు ఇంగువ కలపాలి. రాత్రి నానబెట్టిన అన్నంలో ఈ మసాలా పెరుగు మిశ్రమాన్ని, తగినంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో బలవర్ధకమైన కట్టుయానం గంజి రెడీ.
ఉపయోగాలు
ఇందులో ఉండే అధిక ఫైబర్ వల్ల, ఒక గ్లాసు తాగగానే కడుపు నిండిన భావన
కలుగుతుంది. ఇది అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో
పేరుకుపోయిన మొండి కొవ్వును, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఇది
అద్భుతంగా పనిచేస్తుంది.
మధుమేహానికి చెక్: ఈ బియ్యం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే దీనిని తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది అమృతంతో సమానం.
జీర్ణశక్తికి మంచిది: అన్నాన్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టడం వల్ల ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఇది పేగులకు మేలు చేసే మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను ఇది శాశ్వతంగా దూరం చేస్తుంది.
రోగనిరోధక శక్తి: జింక్, మాంగనీస్ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












