Latest Updates
-
ఈ బఠానీ గుడ్డు మసాలా రుచి చూడండి..ఏమి టేస్ట్ రా నాయనా అదిరిపోతుందంతే..ఎలా చేసుకోవాలంటే.. -
పిల్లల్లో బలాన్ని పెంచే ’రైస్ కేక్’.. గుడ్డు, చక్కెర లేకుండా ఎంతో టేస్టీగా.! -
బరువు తగ్గాలా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే క్వినోవా కిచిడీని ఇలా ట్రై చేయండి! -
వర్షాకాలంలో డెంగ్యూ అలర్ట్.. ప్లేట్లెట్ తగ్గాయని తెలిపే హెచ్చరిక సంకేతాలు ఇవే.! -
పదే పదే వాష్ రూమ్ కి పరిగెడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు! -
పైన టమాటో.. లోపల మసాలా ఆలు.. ఈ బోండా రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తందూరి మసాలా పొడిని ఇలా తయారు చేశారంటే.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఘుమఘుమలు.! -
ఈ 4 వ్యక్తులకు మీ ఇంటి గుట్టు అస్సలు చెప్పకండి! -
Headline for Deeplink -
ఈ రోజు గురు పౌర్ణమి.. మీ ప్రియమైన గురువులకు ఇలా విషెస్ తెలియజేయండి.!
చపాతీ, పూరీలోకి ఇలా కుర్మా చేశారంటే.. ఇంకో రెండు ఎక్కువ తినాల్సిందే.!
చపాతీ, పూరీ, కిచిడీ ఇలా ఇంట్లో ఏదైనా స్పెషల్ చేస్తే అందులోకి కాంబినేష్న్గా తప్పనిసరిగా కుర్మా అడుగుతారు. ఇక కుర్మా అనగానే ఎవరికైనా బంగాళాదుంప గుర్తుకొస్తుంది. జ్యూసీగా, స్పైసీగా ఉండే ఈ కుర్మా పూరీలోకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సారి కుర్మా చేసేటప్పుడు మీల్ మేకర్ జత చేసి చూడండి.. ఇక, మొత్తంగా కూరనే తినేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మీల్ మేకర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంప- మీడియం సైజు
క్యారెట్- ఒకటి
బఠాణీ- అర కప్పు
బీన్స్- 10 నుంచి 15
సోయా చంక్స్- గుప్పెడు
ఉల్లిపాయ- ఒకటి మీడియం సైజు
టమాటా- ఒకటి మీడియం సైజు
పచ్చి కొబ్బరి- అర కప్పు
బిర్యానీ ఆకు- ఒకటి
లవంగాలు- నాలుగు
దాల్చిన చెక్క- రెండు
ఏలకులు- మూడు
జాపత్రి- రెండు
పచ్చిమిర్చి- రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
పుదీనా- కొద్దిగా
కారం- ఒకటిన్నర స్పూన్
ధనియాల పొడి- టీ స్పూన్
జీలకర్ర పొడి- అర టీస్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
మీల్ మేకర్ కుర్మా తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చికొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత బంగాళాదుంప, క్యారెట్ తొక్క తీసి కట్ చేసుకోవాలి. బీన్స్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీల్ మేకర్‌ను కొన్ని వేడినీళ్లలో కాసేపు ఉంచిన తర్వాత నీళ్లు పిండి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మీల్ మేకర్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి.
తర్వాత బంగాళాదుంప, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. పుదీనా ఆకులు వేసి కలుపుకోవాలి. ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అడుగు అంటుతూ నూనె పైకి తేలుతూ ఉడుకుతున్నప్పుడు బఠాణీ వేసుకోవాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వరుసగా వేసి కలుపుకొని ఉడికించుకోవాలి.
ఇప్పుడు గ్లాసు నీళ్లు పోసి ఒకసారి కలుపుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే జ్యూసీగా మీల్ మేకర్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications