ఆహా,ఓహో అనేలా మిగిలిన ఇడ్లీలతో రెస్టారెంట్ స్టైల్ స్నాక్..సూర్యవంశంలో మీనా చేసిన ఇడ్లీ ఉప్మా కన్నా ఇదే టేస్ట్!

Posted By:

సూర్యవంశం సినిమాలో హీరోయిన్ మీనా తన ఇంటికి తండ్రి వచ్చినప్పుడు ఇంట్లొ బియ్యం ఉండవు..ఆ సమయంలో మిగిలి ఉన్న ఇడ్లీలతో తాలింపు పెట్టి ఇడ్లీ ఉప్మా చేస్తుంది..అది తిన్న మీనా తిండ్రి ఆహా ఓహో సూపరో సూపర్ అనడం మనందరికీ గుర్తుండే ఉంటుంది. చేసింది గుర్తుకు తెచ్చుకొని ఇలా చాలామంది మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా చేస్తుంటారు.

అయితే ఈసారి కాస్త వెరైటీగా మరింత టేస్టీగా, మిగిలిపోయిన ఇడ్లీలతో చిల్లీ ఇడ్లీ ట్రై చేయండి. కేవలం 10-15 నిమిషాల్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.సాయంత్రం వేళ స్నాక్స్‌ లా తినడానికి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. మిగిలిన ఇడ్లీలతో చిల్లీ ఇడ్లీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన ఇడ్లీలు - 4
నూనె - వేయించడానికి సరిపడా
మసాలా తయారీకి నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు -పావు టీస్పూన్
ఉల్లిపాయ - 1
టమోటా - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - కొద్దిగా
పసుపు - పావు టీస్పూన్
కారం - అర టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
గరం మసాలా -అర టీస్పూన్
మిరియాల పొడి - పావు టీస్పూన్
చక్కెర - 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
నీరు - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా మిగిలిపోయిన ఇడ్లీలను పొడవుగా ముక్కలుగా లేదా చిన్న చిన్న క్యూబ్స్‌ లా మీకు నచ్చిన ఆకారంలో కోసుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేశాక కోసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను అందులో వేసి, మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి, అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి.

-నూనె వేడయ్యాక ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమోటా ముక్కలు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి, టమోటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి.

-టమోటా గుజ్జు తయారయ్యాక అందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. మసాలా మాడిపోకుండా, పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించండి.

-ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చక్కెర, 3 టేబుల్ స్పూన్ల నీరు పోసి కలపాలి. మిశ్రమం కొద్దిగా మరుగుతుండగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను ఈ మసాలాలో వేసి కలపాలి.

-చివరగా స్టవ్ ఆఫ్ చేసి, నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుంటే చిల్లీ ఇడ్లీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, February 9, 2026, 8:29 [IST]
Desktop Bottom Promotion