Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
రాత్రి మిగిలిన అన్నంతో రుచికరమైన మంచూరియా..15 నిమిషాల్లోనే చేసుకోవచ్చు..ఎలాగంటే..
సాధారణంగా రాత్రి మిగిలిపోయిన అన్నంతో పులిహోర,టమాటో రైస్ వంటివి చేస్తుంటారు చాలామంది. అయితే మిగిలిపోయిన అన్నంతో మంచూరియా చేసుకోవచ్చని మీకు తెలుసా? చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. దీనిని తయారుచేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మిగిలిపోయిన అన్నంతో మంచూరియా చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-మిగిలిపోయిన అన్నం - 1 కప్పు
-మైదా- 2 టేబుల్ స్పూన్లు
-మొక్కజొన్న పిండి- 2 టేబుల్ స్పూన్లు
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
-పచ్చిమిర్చి - 1
-ఉల్లిపాయ - 1
-కాప్సికమ్ - 1/2 కప్పు
-క్యారెట్ - 1/4 కప్పు
-నూనె - వేయించడానికి తగినంత
-సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
-టొమాటో కెచప్- 1 టేబుల్ స్పూన్
-గ్రీన్ చిల్లీ సాస్ - 1/2 టీస్పూన్
-వెనిగర్- 1/2 టీస్పూన్
-నల్ల మిరియాల పొడి - 1/4 టీస్పూన్
-ఉప్పు - తగినంత
-కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా మిగిలిపోయిన అన్నాన్నిమిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్
చేసుకోండి.
-తర్వాత గ్రైండ్ చేసిన అన్నాన్ని బౌల్ లో వేయండి. ఇందులోనే మైదా, మొక్క జొన్న పిండి, కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి పిండిలా కలపండి. మరీ మెత్తగా కాకుండా చూడండి.
-ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని తయారైన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ వేడి చేశాక ఈ ఉండలను అందులో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. వేయించిన ఉండలను ఒక ప్లేట్లోకి తీసుకోండి.
-ఇప్పుడు మరొక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు తరిగిన కాప్సికమ్ మరియు క్యారెట్ వేసి అవి కొద్దిగా మెత్తబడే వరకు వేయించండి. సోయా సాస్, టొమాటో కెచప్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ వేసి బాగా కలపండి.
ఫుడ్ లవర్స్ కోసం స్పెషల్..మంగళూరు స్టైల్ చికెన్ ఉర్వాల్..ఇంట్లోనే ఇలా చేసుకోండి
-కొద్దిగా నీళ్లు లేదా కూరగాయల ఉడకబెట్టిన నీళ్లు పోసి గ్రేవీని కాసేపు ఉడకనివ్వండి.
-గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక వేయించి పెట్టుకున్న అన్నం ఉండలను వేసి బాగా కలపండి. ఉండలకు గ్రేవీ బాగా పట్టేలా కలపండి.
-చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయండి. అంతే మిగిలిపోయిన అన్నంతో ఎంతో రుచికరమైన మంచూరియా రెడీ. ఇది స్నాక్ గా లేదా భోజనంలో సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







