Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మిగిలిన అన్నంతో సూపర్ టేస్టీ గార్లిక్ ఎగ్ రైస్..5 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
గార్లిక్ ఎగ్ రైస్ చాలా రుచికరంగా, త్వరగా, సులభంగా తయారు చేసుకోగలిగే వంటకం. ఇది తరచుగా లంచ్ లేదా డిన్నర్‌లలో లేదా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. గార్లిక్ ఎగ్ రైస్ కేవలం నాలుకకు రుచిని ఇచ్చే వంటకం మాత్రమే కాకుండా వెల్లుల్లి, గుడ్ల వంటి పోషకాలు నిండిన పదార్థాలను ఇందులో ఉపయోగించడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్, శక్తి, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలను కూడా అందిస్తుంది. గార్లిక్ ఎగ్ రైస్ ను జస్ట్ 5 నిమిషాల్లోనే మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-వెల్లుల్లి
-కొత్తిమీర
-కోడిగుడ్లు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-ఉప్పు
-అన్నం
-ఉల్లిపాయ
-క్యారెట్
-ధనియాల పొడి
-గరం మసాలా పొడి
-నిమ్మరసం
తయారీ విధానం
-ముందుగా 1 ఫుల్ వెల్లుల్లి గడ్డను తీసుకొని అందులోని వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి.
-పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను వీలైనంత సన్నగా కట్ చేసుకోండి.
-తర్వాత 4 పచ్చిమిరపకాయలను సన్నగా తరుగుకోవాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో 3 ఎండుమిరపకాయలు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే ఇది అక్కర్లేదు.
-తర్వాత 2 కప్పుల(200గ్రా) అన్నంని ఓ ప్లేట్ లోకి తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి. దీనిని అప్పుడే ఉడికించిన అన్నంతో అయినా లేదా మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో వెల్లుల్లి తరుగు,పచ్చిమిర్చి తరుగు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేశాక సన్నగా,పొడవుగా తరిగిన 1 ఉల్లిపాయ చీలికలు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చెయ్యాలి.
-స్టవ్ మీద పాన్ లోని ఉల్లిపాయలు,క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యేలోగా..ఓ గిన్నెలో మూడు కొడిగుడ్లు పగులకొట్టి వేసి,ఇందులోనే కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
-ఉల్లిపాయలు, క్యారెట్ బాగా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసిన మిరపకాయల మిశ్రమం వేసి కలిపి పాన్ లోనే మిశ్రమం మొత్తాన్ని గరిటతో ఒక మూలకు లాగి, ఖాళీగా ఉన్న చోట కలుపుకున్న కోడిగుడ్ల మిశ్రమం వేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక మెత్తం అంతా కలిసేలా కలునుతూ ఫ్రై చేసుకోవాలి.
-ఇప్పుడు అందులో అన్నం వేసి కలిపాక ఇందులోనే 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి పెద్ద మంట మీద వీటన్నింటిని 2 నిమిషాలు బాగా కలపండి. తర్వాత కొత్తిమీర తరుగు అందులో చల్లుకొని,అర చెక్క నిమ్మరసం పిండి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే సూపర్ టేస్టీ గార్లిక్ ఎగ్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











