Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది!
అమృతం లాంటి రుచి:..పెసరపప్పు చారు ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!
తెలుగు వారి భోజనంలో పప్పు, చారు, రసం వంటి ద్రవ పదార్థాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ పెసరపప్పు చారు అనేది అమృతతుల్యమైన వంటకం. కందిపప్పుతో పోలిస్తే పెసరపప్పు చాలా తేలికగా ఉంటుంది, త్వరగా జీర్ణమవుతుంది.
జ్వరం వచ్చినప్పుడు, కడుపు బాలేనప్పుడు లేదా వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి పెసరపప్పు చారును మించిన ఔషధం మరొకటి లేదు. ఈ చారును తయారు చేయడం చాలా సులభం. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో దీనిని సిద్ధం చేసుకోవచ్చు. రుచితో పాటు బోలెడు ఆరోగయ ప్రయోజనాలు అందించే పెసరపప్పు చారు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-టమోటాలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-చింతపండు
-పసుపు
-కారం
-ఉప్పు
-కొత్తిమీర
-కరివేపాకు
-నీళ్లు
-నూనె
-ఆవాలు
-జీలకర్ర
-ఎండుమిర్చి
-వెల్లుల్లి రెబ్బలు
-ఇంగువ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1కప్పు(180 గ్రాములు)శుభ్రంగా కడిగిన పెసరపప్పు వేసి, రెండున్నర కప్పుల నీళ్లు, పావు టీస్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, 2 టీస్పూన్ల ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆపేయాలి.
-బాగా మెత్తగా ఉడికిన పప్పుని కుక్కర్ లోనే ఉంచి గరిటతోనే బాగా మెదుపుకున్నాక ఇందులోనే 9 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 ఉల్లిపాయ సన్నని ముక్కలు, 3 టమాటోల సన్నని ముక్కలు వేసి కలిపి ఇందులోనే 3-4 కప్పుల నీళ్లు, పావు కప్పు చిక్కగా ఉండే చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం ఒకసారి కలిపి కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి మూతపెట్టకుండా మరిగించాలి.
-మధ్య మధ్యలో కలుపుతూ మీడియం మంట మద 7-8 నిమిషాలు మరిగించాలి.
-ఈలోగా తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో 5 చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, 3 ఎండు మిరపకాయల ముక్కలు వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో చిటికెడు ఇంగువ, కొంచెం కరివేపాకు కూడా వేసి తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి.
-రెడీ చేసుకున్న తాలింపుని స్టవ్ మీద ఉన్న పప్పు మిశ్రమంలో వేసి కలపండి. ఇదే సమయంలో కొంచెం కొత్తిమీర తరుగు కూడా పప్పులో వేసి కలుపుకొని స్టవ్ ఆపేయండి. అంతే సూపర్ టేస్టీ పెసరపప్పు చారు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









