Latest Updates
-
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా!
ఎప్పుడూ ఒకేలా కాకుండా..బ్యాచిలర్స్ కూడా మెచ్చే స్పైసీ టమాటో ఎగ్ కర్రీ!
ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా, లేదా ఏదైనా స్పెషల్ గా, రుచికరంగా తినాలనిపించినప్పుడైనా చప్పున గుర్తొచ్చేది కోడిగుడ్లు మాత్రమే. ఎప్పుడూ ఒకేలా ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్లు కాకుండా కాస్త వెరైటీగా, స్పైసీగా వండుకోవాలనిపిస్తే టమాటో ఎగ్ కర్రీకి మించిన ఆప్షన్ మరొకటి లేదు. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ, పూరీ, పరోటాల్లోకైనా ఈ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్. వంట రాని వారు కూడా చాలా సులభంగా, తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

టమాటో ఎగ్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
ఉడకబెట్టిన కోడిగుడ్లు - 3
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
పసుపు (గుడ్లను వేయించడానికి) - పావు టీస్పూన్
పచ్చిమిర్చి - 2 లేదా 3
ఉల్లిపాయ - 1 మీడియం సైజు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
టమాటాలు - 2 మీడియం సైజు
ఉప్పు - మీ రుచికి తగినంత
కారం - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
నీళ్లు - ముప్పావు కప్పు వరకు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
మ్యాగీ ఎప్పుడూ వేడివేడిగానేనా? ఒకసారి ఈ చల్లని మ్యాగీ రైతా ట్రై చేయండి!
టమాటో ఎగ్ కర్రీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి లేదా పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో పావు టీస్పూన్ పసుపు వేసి, ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేయాలి. గుడ్ల పైన చాకుతో సన్నని గాట్లు పెడితే మసాలా లోపలికి బాగా వెళుతుంది. గుడ్లు లేత బంగారు రంగులోకి మారి, పైన క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన ఒక ప్లేట్ లో పెట్టుకోండి.
-ఇప్పుడు అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి, లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు మధ్యమంట మీద బాగా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవడం ముఖ్యం. ఆ తర్వాత సన్నగా తరిగిన లేదా క్రష్ చేసిన టమాటోలను అందులో వేయాలి.
-టమాటాలు గుజ్జులా మారి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు అందులో మీ రుచికి తగినంత ఉప్పు, 1 టీస్పూన్ కారం, అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ టమాటో గుజ్జుకు పట్టేలా ఒక నిమిషం పాటు వేయించండి.
-గ్రేవీ చిక్కదనం కోసం అందులో అర నుండి ముప్పావు కప్పు వరకు నీళ్లు పోసి బాగా కలపండి. నీళ్లు మరిగడం ప్రారంభం కాగానే, మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను ఈ గ్రేవీలో జాగ్రత్తగా వేయాలి.
-మూత పెట్టి, మంటను సిమ్ లో ఉంచి మరో 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా చేయడం వల్ల మసాలాల ఫ్లేవర్ అంతా గుడ్లకు బాగా పడుతుంది. గ్రేవీ చిక్కబడి కూర నుండి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి.
-చివరగా పైన కొత్తిమీరను చల్లుకుంటే వేడి వేడి టమాటో ఎగ్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
