శివుడికి అత్యంత ఇష్టమైన రెసిపి..శివరాత్రి నాడు నైవేద్యంగా ఇది పెడితే అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తాడు,ఎలా చేయాలంటే

Posted By:

శివుడు ఆగ్న లేనిదే చీమ కూడ కదలదు అంటారు. సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. యావత్‌ సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించిన దినం కావడంతో మహాశివరాత్రిగా పరిగణిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రిని ఫిబ్రవరి 26న జరుపుకుంటారు.

మహాశివరాత్రి సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు శివుడు, పార్వతిదేవికి దేవాలయాలు,ఇళ్లలో నైవేద్యాలు సమర్పిస్తారు, దీనిలో తాండైని ప్రత్యేక ప్రసాదంగా సమర్పిస్తారు. మీరు కూడా ఈ మహాశివరాత్రికి మీ ఇంట్లో శివుడికి అత్యంత ఇష్టమైన తండైని తయారు చేయాలనుకుంటే ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

తాండై తయారీకి కావాల్సిన పదార్థాలు

-అరకప్పు బాదంపప్పు
-2 టేబుల్ స్పూన్లు గసగసాలు
-2 టేబుల్ స్పూన్లు పుచ్చకాయ గింజలు
-2 టేబుల్ స్పూన్లు సోంపు గింజలు
-8-10 నల్ల మిరియాలు
-6-8 ఏలకులు
-10-12 కుంకుమపువ్వు రేకులు
-2 టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ లేదా ఎండిన గులాబీ రేకులు
-అర కప్పు చక్కెర
-1 లీటరు పాలు
-అరకప్పు కప్పు చల్లటి నీరు
-8-10 జీడిపప్పు,పిస్తాపప్పులు

తాండై తయారీవిధానం

-ముందుగా బాదం, గసగసాలు, బాదం, సోంపు, నల్ల మిరియాలు, ఏలకులను నీటిలో 4-5 గంటలు నానబెట్టండి.

-తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయాలి.

-ఈ పేస్ట్‌ను ఒక పెద్ద పాత్రలో పోసి ఇందులో చల్లటి నీరు పోసి బాగా ఫిల్టర్ చేయండి.

-ఇప్పుడు అందులో పాలు, చక్కెర, రోజ్ వాటర్ కలపండి. పైన కుంకుమపువ్వు వేసి తాండై 1-2 గంటలు ఫ్రిజ్‌లో చల్లబరచండి.

-గ్లాసులో తాండై పోసి..తరిగిన జీడిపప్పు, పిస్తాపప్పులతో అలంకరించి సర్వ్ చేయాలి.

-ఈ మహాశివరాత్రిక మహాదేవునికి ఇష్టమైన ప్రసాదం తాండైని తయారు చేసి దానిని ఈశ్వరుడికి సమర్పించి,తర్వాత ప్రసాదంగా మీరు స్వీకరించండి.

[ of 5 - Users]
Story first published: Sunday, February 16, 2025, 22:30 [IST]
Desktop Bottom Promotion