Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఘుమఘుమలాడే మసాలా జీడిపప్పు..ఇంట్లోనే ఈజీగా 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే..
సాయంత్రం అయితే చాలు వేడి వేడిగా, కరకరలాడే స్నాక్ తినాలని మన మనసు కోరుకుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే చల్లటి చిరుజల్లులు పడుతున్న సాయంత్రం సమయంలో ఏదైనా వేడిగా తినాలని,తాగాలని నోరు తహతహలాడిపోతుంటది. ఆ సమయంలో పక్కనే వేడివేడి టీ లేదా కాఫీ ఉంటే ఆ ఫీలింగ్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, అకస్మాత్తుగా అతిథులు వచ్చినప్పుడు లేదా ఏదైనా చిన్నపాటి వేడుకకు వెంటనే ఏదైనా చేసి పెట్టాలంటే మనకు గుర్తొచ్చే వాటిలో మసాలా జీడిపప్పు ముందుంటుంది.
షాపుల్లో, బేకరీల్లో గాజు సీసాలలో మనల్ని ఊరిస్తూ కనిపించే మసాలా జీడిపప్పును చూసినప్పుడల్లా తినాలనిపిస్తుంది. అయితే బయటకొనే వాటికంటే స్వచ్ఛమైన నేతితో, మన చేతులతో చేసుకుంటే ఆ రుచి, ఆరోగ్యం రెండూ మన సొంతమవుతాయి. కేవలం పది నిమిషాల్లో, ఎంతో సులభంగా ఈ రుచికరమైన మసాలా జీడిపప్పును ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

మసాలా జీడిపప్పు తయారీకి కావలసిన పదార్థాలు
-జీడిపప్పు - 1 కప్పు
-నెయ్యి - 1 టీస్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా
-కారం - అర టీస్పూన్
-జీలకర్ర పొడి - పావు టీస్పూన్
-నల్ల మిరియాల పొడి - పావు టీస్పూన్
-గరం మసాలా - పావు టీస్పూన్
-ఇంగువ - చిటికెడు
మసాలా జీడిపప్పు తయారీ విధానం
-ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, చిటికెడు ఇంగువ వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఈ మసాలా మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి సన్నని మంటపై వేడి చేయండి. పాన్ వేడెక్కిన తర్వాత ఒక టీస్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక జీడిపప్పు వేసి దోరగా, బంగారు రంగులోకి మారేవరకు నిదానంగా వేయించాలి. జీడిపప్పు మాడిపోకుండా, అన్ని వైపులా సమానంగా వేగేలా కలుపుతూ ఉండాలి.
-జీడిపప్పు చక్కగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని వేయించిన జీడిపప్పుపై చల్లి ఆ పాన్ వేడి మీదే బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోకుండా, వాటి సహజమైన సువాసన జీడిపప్పుకు చక్కగా పడుతుంది. స్టవ్ ఆన్ లో ఉంచి మసాలా వేస్తే అది మాడిపోయి, రుచి చేదుగా మారే అవకాశం ఉంది.
-అంతే కరకరలాడే, ఘుమఘుమలాడే మసాలా జీడిపప్పు రెడీ. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్ గా, కరకరలాడుతూ ఉంటాయి.
-దీన్ని వేడివేడిగా తిన్నా లేదా పూర్తిగా చల్లారిన తర్వాత ఆస్వాదించినా చాలా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
