Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
వర్షాకాలపు బెస్ట్ స్నాక్ ఇదే..ఆరోగ్యం,రుచి కలగలిసిన బెల్లం రాగి బూరెలు..ఎలా చేసుకోవాలంటే
వర్షాకాలం లేదా చలికాలం వంటి వాతావరణంలో వేడివేడిగా, తియ్యగా, ఆరోగ్యకరంగా ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే రాగి బూరెలు బెస్ట్ ఆప్షన్. బెల్లం, రాగి పిండితో చేసే ఈ బూరెలు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి బోలెడంత మేలు చేస్తాయి. ఇవి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయ పిండివంటలలో ఒకటిగా ప్రాచుర్యం పొందాయి. తరచుగా పండుగలు, శుభకార్యాలలో వీటిని తయారు చేస్తుంటారు. రాగి బూరెలు చేయడానికి సాధారణంగా ఇంట్లో దొరికే పదార్థాలే సరిపోతాయి.
రాగి బూరెలు రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా ముందుంటాయి. ముఖ్యంగా రాగి పిండి, బెల్లం కలయిక అనేక పోషకాలను అందిస్తుంది. రాగిలో ఉన్న కార్బోహైడ్రేట్లు, బెల్లంలోని సహజ చక్కెరలు శరీరానికి శక్తిని తక్షణమే అందిస్తాయి. ఇది రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. రాగి, బెల్లం రెండింటిలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత ఉన్నవారికి, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. రాగిలో ఉండే వివిధ పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి, వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. మీ ఇంట్లోనే బెల్లంతో రాగి బూరెలు మెత్తగా రుచికరంగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి బూరెలు తయారీకి కావాల్పిన పదార్థాలు
-బెల్లం తురుము
-గోధుమ పిండి
-రాగి పిండి
-ఎండు కొబ్బరి తురుము
-యాలకల పొడి
-ఉప్పు
-ఆయిల్
-పచ్చి నువ్వులు
రాగి బూరెలు తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రాగిపిండి, 1 కప్పు గోధుమ పిండి,పావు కప్పు ఎండుకొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్ల పచ్చి నువ్వులు, 1 టీస్పూన్ యాలకల పొడి,చిటికెడు ఉప్పు వేసి మొత్తం అన్నీ కలిసేలా స్పూన్ తో కలిపి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 కప్పు బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి మీడియం మంట మీద బెల్లాన్ని కరగనివ్వాలి. పాకం రానవసరం లేదు.
-బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. బెల్లం నీళ్లను పక్కన పెట్టిన పిండి బౌల్ లో వడకట్టి పోసుకోండి. పిండిలో బెల్లం నీళ్లు బాగా కలిసేలా కలుపుకోండి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని ముద్దలా వచ్చేదాకా కలుపుకోవాలి. పిండి మరీ ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు. కాస్త లూజ్ గానే ఉండాలి.
-తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కలిపిన పిండిని కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకొని ఏదైనా కవర్ పై పెట్టి బూరెల్లా వత్తుకోవాలి. కొంచెం మందంగానే చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేసి ఇందులో వత్తుకున్న బూరెలు వేసుకోండి. బూరె మీదకు ఆయిల్ గరిటతో నెడుతూ ఉంటే అవి బాగా పొంగుతాయి. తర్వాత వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకోండి. అంతే రాగి బూరెలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











