Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ఇడ్లీ,దోశ,పూరీ ఇవన్నీ తుప్పాస్..చుక్క ఆయిల్ లేకుండా కొర్రలతో చేసే ఇది తింటే బాహుబలి బలం..ఎలా చేసుకోవాలంటే
సాధారణంగా మనం పొద్దున్నే తినే బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ, దోశ, పూరీ, బోండా వంటివి తీసుకుంటాం. అయితే ఓసారి ఇవన్నీ పక్కనపెట్టి మోస్ట్ హెల్దీయెస్ట్ మల్టీ గ్రెయిన్ మిల్లెట్ కదంబం(Kadambam) ట్రై చేయండి. పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ల దాకా అందరూ తినగలిగే హెల్తీ రెసిపి ఇది. వెజిటేబుల్స్, ధాన్యాలతో కలిపి చేసే ప్రొటీన్ రిచ్ ఫుడ్ ఇది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందుకులోకి తిన్నా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం కదంబం ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలి, దీని తయారీకి కావాలసిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూసేయండి.
కదంబం తయారీకి కావలసిన పదార్థాలు
-కొర్రలు
-మిరియాలు
-జీలకర్ర
-కందిపప్పు
-కరివేపాకు
-కొత్తిమీర
-ముడి పెసలు
-నల్ల శెనగలు
-సొరకాయ ముక్కలు
-క్యారెట్ ముక్కలు
-ఎండు కొబ్బరి ముక్కలు
-నువ్వులు
-మునగాకు
-శొంఠి
-ఇంగువ
-దాల్చిన చెక్క
-పచ్చి బఠానీలు
-ఉల్లిపాయ తరుగు
-తోటకూర తరుగు
-ఉప్పు
-నిమ్మరసం

కదంబం తయారీ విధానం
-ముందుగా 1 కప్పు కొర్రలను రెండు గంటల సేపు నానబెట్టండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నల్ల శెనగలు వేసి లో ప్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి.
-శెనగలు సగం వరకు రోస్ట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ముడి పెసలు వేసి లో ప్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి.
-తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు లేదా కందులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. జీలకర్ర వేగాక అందులో పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేపుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత అందులో 2 రెబ్బల కరివేపాకు వేసి ఆకు డ్రైగా అయ్యేదాకా రోస్ట్ చేసుకోండి.
-తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి చిటపటమనేవరకు వేపుకోండి. ఆ తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా మునగాకు వేసి ఆకు పూర్తిగా డ్రై అయ్యేదాకా లో ప్లేమ్ మీదనే రోస్ట్ చేసుకోవాలి.
-తర్వాత అందులో 1 ఇంచు శొంఠి, పావు చెంచా ఇంగువ కూడా వేసి లో ప్లేమ్ మీదనే 2 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దించేసి ఈ దినుసుల మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె లేదా కడాయి పెట్టి అందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి నీళ్లను తెర్లకాగనివ్వాలి.
-నీళ్లు తెర్లకాగుతున్నప్పుడు అందులో రెండు గంటలు నానబెట్టిన 1 కప్పు కొర్రలు వేయండి. కొర్రలు సగం పైగా ఉడికిన తర్వాత అందులో పిడికెడు పచ్చి బఠానీలు, కొన్ని క్యారెట్ ముక్కలు 1 కప్పు సొరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి కలిపాక అందులో 1 ఉల్లిపాయ తరుగు వేసి కలిపి మూతపెట్టి 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ..ఇలా చేశారంటే మతి పోయే రుచి
-80 శాతం ఉడికిన తర్వాత అందులో 1 కప్పు తోటకూర తరుగు వేసి కలిపి మూతపెట్టి మరో 5 నిమిషాలు లో ప్లేమ్ మీద ఉడకనివ్వాలి.
-దాదాపుగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడి, కొద్దిగా రాక్ సాల్ట్ వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో కొద్దిగా నెయ్యి , కొత్తిమీర తరుగు, అర చెక్క నిమ్మరసం వేసి కలిపితే కాదంబం రెడీ.
-ఏదైనా రైతాతో దీనిని వేడి వేడిగా తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications