Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
Central Bank Gold Buying Crashes 80% in January, Falls to Just 5 Tonnes WGC -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
ఈ రోజు రాత్రి డిన్నర్ కి వేడివేడిగా చపాతీ లేదా పూరీ చేస్తున్నారా? దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా, నోటికి రుచిగా ఉండేలా ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఇంట్లో ఉండే గుడ్లతోనే రాచరికపు రుచిని అందించే మొఘలాయి ఎగ్ కర్రీ ట్రై చేయండి.
ఈ గ్రేవీ కేవలం చపాతీ, పూరీలకే కాకుండా.. వేడి వేడి అన్నంలోకైనా, దోశ, పరాటాలలోకైనా అద్భుతంగా సెట్ అవుతుంది. నోరూరించే ఈ స్పెషల్ ఎగ్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
మొఘలాయి ఎగ్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు - 4
నూనె - 1 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 2 కప్పులు
యాలకులు - 2
లవంగాలు - 2
దాల్చినచెక్క - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 10
అల్లం - 2 అంగుళాల ముక్క
పచ్చిమిర్చి - 2
కమ్మని నెయ్యి - 1 టేబుల్ స్పూన్
రిచ్ గ్రేవీ కోసం:
జీడిపప్పులు - 10
బాదం పప్పులు - 10
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
కారం - అర టేబుల్ స్పూన్
పసుపు - పావు టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకు - 1
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
మొఘలాయి ఎగ్ కర్రీ తయారీ విధానం
-ముందుగా వేడి నీళ్లలో జీడిపప్పు, బాదం పప్పులను 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్ వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తని క్రీమ్ రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక చెంచా నెయ్యి వేసి వేడి చేయండి. అందులో ఉడికించిన గుడ్లను వేసి అవి లేత గోధుమ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
-అదే పాన్ లో మరో చెంచా నెయ్యి వేసి యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి చిటపటలాడించండి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించి స్టవ్ ఆపేయండి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-మళ్లీ స్టవ్ ఆన్ చేసి అదే పాన్ లో నెయ్యి, నూనె వేడి చేయండి. జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాక, ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసి మీడియం మంట మీద పచ్చివాసన పోయేలా వేయించాలి.
-ఇప్పుడు పావు కప్పు నీళ్లు పోసి గ్రేవీని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఆ తర్వాత కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. గ్రేవీలో నూనె పైకి తేలుతున్నప్పుడు, పెరుగు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించండి.
-తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు-బాదం క్రీమ్ వేసి రెండు నిమిషాలు సన్నని మంటపై మరిగించాలి.
-గ్రేవీ చిక్కబడి కమ్మని వాసన వస్తున్నప్పుడు వేయించి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసి మసాలా అంతా గుడ్లకు పట్టేలా కాసేపు మరిగించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే నోరూరించే ఘుమఘుమలాడే మొఘలాయి ఎగ్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













