Latest Updates
-
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.!
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే!
ఎప్పుడూ తినే సాధారణ ఇడ్లీలకు కాస్తంత వైవిధ్యం జోడిస్తే ఎలా ఉంటుంది? దానికి ఆరోగ్య సిరి అయిన మునగాకు తోడైతే? సూపర్ ఫుడ్ గా పేరొందిన మునగాకు పొడితో చేసే ఇడ్లీలు ఒక్కసారి రుచి చూశారంటే, మీ వేళ్లు మీరే కొరుక్కుంటారు. వినడానికే నోరూరుతోంది కదూ? ఈ అద్భుతమైన వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

మనగాకు ఇడ్లీ తయారీ విధానం
-లేత మునగాకులను శుభ్రమైన నీటిలో కడిగి ఆరబెట్టాలి. ఆకులలో తడి అస్సలు ఉండకూడదు. లావుపాటి కాడలు ఉంటే తీసేయండి.
-ఇప్పుడు ఒక మందపాటి బాండీని స్టవ్ మీద ఉంచి ఈ మునగాకులను నూనె లేకుండా కరకరలాడేంత వరకు సన్నని మంటపై వేయించాలి. ఆకులు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
-ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా పచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా, కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. అవి బంగారు రంగులోకి రాగానే వేరొక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-తర్వాత బాండీలో కొద్దిగా నూనె వేసి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి కొన్ని నిమిషాల పాటు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-మసాలా దినుసులు అన్నీ చల్లారిన తర్వాత, మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, వెల్లుల్లి, మిర్చి, ఒక చిన్న చింతపండు ముక్క, తగినంత ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత కరకరలాడే మునగాకులను కూడా జార్ లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ రెండు మిశ్రమాలు బాగా కలిసేలా ఒకసారి తిప్పితే, గుమగుమలాడే ఆరోగ్యకరమైన మునగాకు పొడి రెడీ.
-ఇప్పుడు అసలైన ఘట్టం. మీరు తయారుచేసుకున్న వేడి వేడి సాదా ఇడ్లీలను సిద్ధంగా ఉంచుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేయండి. అందులో ఇడ్లీలను వేసి, పైనుంచి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల మునగాకు పొడిని చల్లండి. ఇడ్లీలన్నింటికీ ఈ పొడి బాగా పట్టేలా మెల్లగా కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన మునగాకు పొడి ఇడ్లీలు రెడీ. వీటిని కమ్మటి పల్లీల చట్నీ లేదా కొబ్బరి చట్నీతో వడ్డించండి. ఇడ్లీలు పొడితో కలిసి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
