Latest Updates
-
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు!
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు!
మస్టర్డ్ ఆయిల్ లేదా ఆవ నూనె ఉపయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంటల రుచిని పెంచడం దగ్గర నుంచి పసిపిల్లలకి చేసే మసాజ్ నుండి వరకు ఇలా ప్రతి ఇంట్లో ఆవనూనె ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అయితే నేడు మార్కెట్లో దొరికే ఆవనూనెల్లో చాలా వరకు రసాయనాలతో కల్తీ అవుతున్నాయి. ఇవి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తాయి.
కాబట్టి మీ వంటగదిలో ఉండే ఆవాలతోనే, ఎలాంటి మెషీన్లు లేకుండా 100 శాతం స్వచ్ఛమైన, రసాయనాలు లేని ఆవ నూనెను మీ చేతులతో మీరే తయారు చేసుకోవచ్చు. వంట కోసం పెద్ద మొత్తంలో తీయడం కష్టమే అయినా, పిల్లల మసాజ్, చర్మ , కేశ సంరక్షణకు సరిపడా నూనెను కేవలం ఒక మిక్సీ, ఓ శుభ్రమైన కాటన్ గుడ్డ సాయంతో సులభంగా తయారు చేయవచ్చు.అదెలాటో ఇక్కడ చూడండి.

ఆవ నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు
నల్ల లేదా పసుపు ఆవాలు: 2 కప్పులు
గోరువెచ్చని నీరు: 2-3 టేబుల్ స్పూన్లు
నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్: 1-2 టీస్పూన్లు
ఆవ నూనె తయారీ విధానం
-ముందుగా ఆవాల్లోని దుమ్మును ఏరి శుభ్రం చేసుకోండి. ఆవాల్లోని తేమ పోవడానికి వాటిని ఒకటి, రెండు గంటల పాటు ఎండలో ఉంచండి. లేదా స్టవ్ మీద పెనం పెట్టి సన్నని మంటపై ఒక్క నిమిషం పాటు దోరగా వేయించండి.
-ఆవాలు చల్లారాక, పొడిగా ఉన్న మిక్సీ జార్ లో వేయండి. మిక్సీని ఒకేసారి వేగంగా తిప్పకుండా, ఆపుతూ, ఆన్ చేస్తూ బరకగా పొడి చేయండి. ఇప్పుడు ఆ పొడిపై 2-3 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీటిని చల్లండి. ఇలా చేయడం వల్ల ఆవాల్లో దాగి ఉన్న సహజ నూనెలు, వాటి ఘాటైన సువాసన బయటకు వస్తాయి. ఆ తర్వాత మిక్సీని మరో రెండు నిమిషాలు తిప్పితే అది మెత్తటి పేస్ట్ లా మారుతుంది.
-ఈ పేస్ట్ ను ఒక వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకుని, మీ చేతులతో 3-4 నిమిషాల పాటు బలంగా రుద్దుతూ కలపండి. అప్పుడే మీ చేతులకు జిడ్డుగా నూనె తగలడం మీరే గమనిస్తారు.
-ఇప్పుడు ఒక శుభ్రమైన పల్చటి కాటన్ వస్త్రాన్ని తీసుకోండి. ఆవాల పేస్ట్ ను అందులో వేసి మూటకట్టి, ఒక గిన్నెలో గట్టిగా పిండండి. అంతే బంగారు వర్ణంలో, ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన ఆవ నూనె చుక్కచుక్కగా గిన్నెలో పడుతుంటే చూసి మీరు ఆశ్చర్యపోతారు.
-దీనిని తడిలేని గాజు సీసాలో భద్రపరుచుకోండి.
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా
ఇంట్లో తీసిన స్వచ్ఛమైన నూనెతో అద్భుత ప్రయోజనాలు
-ఇందులో సహజ ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టి, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది.
-ఎలాంటి కెమికల్స్ లేని ఈ నూనె నవజాత శిశువుల సున్నితమైన చర్మానికి, ఎముకల బలానికి అద్భుతమైన మసాజ్ ఆయిల్.
-ఈ నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి కీళ్లు, కండరాలపై మర్దన చేస్తే కండరాల, కీళ్ల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications