Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
నో మిల్క్, నో షుగర్..ఎక్కువ రోజులు నిల్వ ఉండే సూపర్ టేస్టీ రవ్వ లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
పాలు పంచదార లేకుండా చేసే రవ్వ లడ్డు టేస్ట్ ఒక్కసారి చూసినోళ్లు మళ్లీ మళ్లీ తినాలని కోరుకుంటారు. దీని రుచి అమోఘం,అద్భుతం. అంతేకాకుండా దీనిని తయారుచేయడం చాలా ఈజీ. అంతేకాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చిన్న పిల్లలకు కూడా ఈ లడ్డు చాలా బాగా నచ్చుతుంది. పాలు,పంచదార లేకుండా నోట్లో కరిగిపోయేంత మెత్తగా ఉండే రవ్వ లడ్డు తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-బొంబాయి రవ్వ
-పటిక బెల్లం
-నెయ్యి
-జీడిపప్పు
-ఎండుద్రాక్ష
-పచ్చి కొబ్బరి తురుము
-యాలకల పొడి
-మిల్క్ పౌడర్

తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు పటిక బెల్లం మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కాడాయి పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో గుప్పెడు జీడిపప్పు వేసి సగం పైకి వేగిన తర్వాత ఇందులో గుప్పెడు ఎండుద్రాక్ష వేసి అవి ఉబ్బేవరకు వేయించుకొని తర్వాత ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కడాయిలోని నెయ్యిలోనే 1 కప్పు సన్నని బొంబాయి రవ్వ వేసి కలుపుతూ వేయించుకోవాలి. రవ్వ రంగు మారడం మొదలైన సమయంలో అందులో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి రెండూ గోధుమ బంగారు రంగులోకి మారేదాకా వేయించుకోని తర్వాత ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ముందుగా గ్రైండ్ చేసిన పటిక బెల్లం పొడి ముప్పావు కప్పు వేసి ఇందులోనే అరకప్పు నీళ్లు కూడా పోసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. నూనెలా జిడ్డుగా పాకం మారిన తర్వాత కడాయిని స్టవ్ మీద నుంచి దించేసి అందులో పావు స్పూన్ యాలకల పొడి, వేయించిన రవ్వ మొత్తం ఇందులో వేసి కలిపి 10 నిమిషాలు అలా వదిలేయాలి.
-రవ్వ పాకం మొత్తాన్ని పీల్చుకొని కొంచెం మెత్తగా అయ్యాక అందులో వేయించిన జీడిపప్పు,ఎండుద్రాక్ష,2-3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వాటిని లడ్డుల్లా చేసుకోవాలి. అంతే టేస్టీ రవ్వ లడ్డు రెడీ. వారం రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
