For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సండే స్పెషల్.. ఒకటి.. రెండు..కాదు మీకోసం 11వెరైటీ చికెన్ వంటలు

|

ప్రస్తుతం మారుతున్న జీవన శైలితో పాటు మన ఆహార అలవాట్లు మారుతున్నాయి. సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అది శాకాహారమైనా... మాంసాహారమైన సరే. శరీర నిర్మాణానికి మాంసకృత్తులు చాలా అవసరం. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవం తంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి.

శాకాహారంలో ప్రతి రోజూ రకరకాల తాజా గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్ తో వంటలు వండుకొని తింటారు. అదే మాంసాహారులలైతే....? వీరు మాత్రం ఎక్కువగా చికెన్, మటన్, ఫిష్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మాంసాహారులు ఎప్పుడూ ఒక రకమైన వంటకాన్ని రుచి చూడం వల్ల కొంత బోరు అనిపించవచ్చు. అలా బోరు అనిపించే రుచులు కాకుండా, ఈ సండే స్పెషల్ గా కొన్ని విభిన్నమైన రుచులకు మీ ముందుకు తీసుకొస్తోంది తెలుగు బోల్డ్ స్కై. కామ్.

ఆదివారం అనగానే కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో ఉంటారు. కాస్త స్పెషల్ వంటకాలు ఉండాలని అనుకుంటారు. మాంసాహారం తినేవాళ్లకైతే తప్పనిసరి ఆదివారం నాన్ వెజ్ ఉండాల్సిందే లేకపోతే వెలితిగా ఉంటుంది. మాంసంతో కూరలు వగైరా చేసుకోవడం తెలుసు కాని కాస్త వెరయిటీగా ఎలా తయారు చేయడమో చాలా మందికి తెలియదు. మాంసాహార ప్రియల్లో చాలా మంది చికెన్ వెరైటీలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇది రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇలా ఆరోగ్యాన్ని, రుచిని రెండింటిని అంధించే ఆహారపు కాంబినేషన్ చాలా అరుదు. చికెన్ కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు, మాంసకృత్తులు దండిగా లభిస్తాయి. తేలికగా జీర్ణము అవుతుంది. కోడిమాంసము వేడి చేస్తుందని అనుకోవడం సరైనది కాదు... ఇది మంచి పౌష్టికాహారము.

ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పులావ్

మాంసాహార రుచుల్ని ఎన్ని రకాలుగా వండినా అన్నిరకాల్లోనూ ఏదో ఒక డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. అందులోనే ఆంధ్ర వంటకాలంటే రుచితో పాటు కొంచెం ఘాటు కూడా ఉంటుంది. కారంగా ఉండే వంటలు తయారు చేయడం అన్నా, తినడం అన్నా ఆంధ్రావారి స్పెషల్ అని చెప్పొచ్చు. కాబట్టి మామూలుగా చేసుకొనే పులావ్ ను కొంచెం ఆంధ్రా స్టైల్లో చికెన్ కలిపి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో కోకోనట్ మిల్క్ కలపడం వల్ల కొంచెం స్వీట్ గా కారంగా తయారయ్యే ఈ వెరైటీ చికెన్ పులావ్ మీరు తయారు చేసి టేస్ట్ చూడండి...

మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్పైసీ చికెన్ మసాలా...

సాధారణంగా మనకు ఇష్టమైన వంటలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని మళ్ళీ మళ్ళీ తయారు చేయడానికి విసుగు అనిపించదు. ఎందుకంటే వాటి రుచి అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. అలాంటి వాటిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అమితంగా ఇష్టపడే వంట స్పైసీ చికెన్ మసాలా కర్రీ. ఇది చూడటానికి, తినడానికి రెస్టారెంట్ వంటాల అనిపిస్తుంది కానీ రెస్టారెట్ ఐటమ్ మాత్రం కాదు. మనమే ఇంట్లో స్వయంగా చేసుకోవచ్చు.

డిన్నర్ పార్టీ స్పెషల్ - చికెన్ ముర్గ్ కుర్మా

ముర్గ్ కుర్మాను స్పెషల్ గా వండుతారు. దీన్ని కొబ్బరి మరియు పెరుగుతో తయారు చేస్తారు. ఈ రుచికరమైన చికెన్ ముర్గ్ కుర్మాను రోటీ, చపాతీ, నాన్ తో తినవచ్చు. ఈ రుచికరమైన టేస్టీ వంటకం రాత్రి డిన్నర్ పార్టీకి బాగా సూట్ అవుతుంది.

స్వీట్ అండ్ స్పైసీ టేస్ట్ చికెన్ దో ప్యాజ్..

తియ్యతియ్యగా.... కారం కారంగా ఉండే చికెన్ దో ప్యాజ్. చికెన్ వెరైటీలలో ఇదో రకం. ఈ వంటకం పంజాబీలు ఎక్కువగా ఇష్టపడుతారు. చికెన్ దో ప్యాజ్ ఒక డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఇది సాధారణ చికెన్ మసాలా కర్రీలానే ఉంటుంది. అయితే ఉల్లిపాయలను ఎక్కువగా వాడటం వల్ల చికెన్ ఫేవర్ మారుతుంది. దాంతో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది బిర్యాని, చపాతీలకు అద్భుతమైనటువంటి కాంబినేషన్. భారతీయ సుంగద్రవ్యాలు, ఉల్లిపాయ ముక్కలు, చికెన్ తో చేసే ఈ వంటకాన్నీ ఏ కార్యాలకైనా(సందర్భాలలోనైనా) వండుకోవచ్చు.

కోరి రోటీ..మంగళూరు స్పెషల్..

ధక్షిణ భారత దేశంలో మంగళూరు వంటకాలు చాలా ప్రసిద్ది. ముఖ్యంగా మాంసాహార వంటకాలు. అందులో సీ ఫుడ్ చాలా పాపులర్. మాసాహార వంటకాల్లో వెరైటీగా రుచి చూడాలంటే మంగళూరు వంటకాల్ని ఇంట్లో ప్రయత్నించవచ్చు. ఈ మంగళూరు మాంసాహార వంటలు కారం కారంగా రుచి... మంచి రంగుతో ఘుమఘుమలాడుతుంటాయి.

హాట్ అండ్ స్పైసీ చికెన్ పెప్పర్ ఫ్రై

చికెన్ పెప్పర్ కార్న్ రిసిపి ఇండియన్ నాన్ వెజ్ వంటకాల్లో స్పెషల్. ఈ పెప్పర్ చికెన్ నోరూరిస్తే స్పైసీగా తింటుంటే కళ్ళవెంబడి నీళ్ళు రావాల్సిందే. ఈ స్పెషల్ పెప్పర్ చికెన్ తయారు చేయడం చాలా సులభం. మీరు కనుక స్పైసీ ఫుడ్ ను ఇష్టపడుతున్నట్లైతే ఈ పెప్పర్ చికెన్ కొన్ని నిముషాల్లో తయారు చేసేయొచ్చు . ఈ స్పైసీ ఇండియన్ చికెన్ పెప్పర్ ఫ్రై అతిథులకు ప్రత్యేకంగా వండ్డించవచ్చు. పార్టీకి, ఫంక్షన్లకు ప్రత్యేకంగా తయారు చేసుకొనే ఈ చికెన్ రిసిపి సైడ్ డిష్ గా బాగా నప్పుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు తయారు చేసి రుచి చూసేయండి...

స్పెసీ చికెన్ బర్త...

పాపులర్ సైడ్ డిష్ చికెన్ బర్త ఒక పాపులర్ సైడ్ డిష్. దీన్ని ఎక్కువగా ప్లెయిన్ రైస్, రోటిస్ కి మంచి కాంబినేషన్. ఈ నాన్ వెజిటేరియన్ రిసిపిని చికెన్ మరియు ఇండియన్ మసాలాలతో తయారు చేస్తారు. ఇతర నాన్ వెజిటేరియన్ వంటకాలతో పోల్చితే ఈ వంట మరింత స్పైసీగా ఉంటుంది. ఈ నాన్ వెజిటేరియన్ వంటకాన్ని కొంచెం వెరైటీగా తయారు చేస్తారు. చికెన్ బాగా మెత్తగా చిదిమి తర్వాత మసాలాలు, ఉల్లిపాయలతోటి వండుతారు. మరి ఈ వంటను ఎలా తయారు చేయాలో చూద్దాం...

చికెన్ టిక్కా బిర్యానీ

చికెన్ బిర్యానీ ఓ ట్రెడిషిన ల్ వంటకం. ఇది ఇండియా, పాకిస్తాన్ లో ఓ పాపులర్ రైస్ డిష్. బిర్యానీ వంటకంలో చాలా వెరైటీలు కలిగి ఉన్నాయి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, సింధీ బిర్యానీ, షాన్ చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ చికెన్ బిర్యానీ ఇలా... చాలా వెరైటీలే ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్ లో చికెన్ టిక్కా బిర్యాని చాలా పాపులర్ రిసిపి. ఇది చాలా టేస్ట్ గా కలర్ ఫుల్ గా ఉంటుంది. చికెన్ టిక్కాను బిర్యానీ మిక్స్ చేయడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేయడం అంత సులభం కాదు. అతి త్వరగా చేసి వడ్డించే వంటకం కాదు. దీన్ని తయారు చేయడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకొన్నా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది.

చికెన్ చిల్లీ టోస్ట్ - ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

సాధారణంగా ప్లేయిన్ టోస్ట్ బట్టర్, లేదా జామ్ వంటి కాంబినేషన్ లో బయట తింటుంటాం. అలాగే ఇంట్లో కూడా తయారు చేసి తింటుంటాం. అయితే ప్లెయిన్ టోస్ట్ తిని, తిని బోర్ గా అనిపిస్తుంటే మాత్రం బ్రేక్ ఫాస్ట్ రిసిపీగా ఈ వెరైటీ చికెన్ చీజ్ చిల్లీ టోస్ట్ ను తయారు చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చికెన్ టోస్ట్ ను ప్రయాత్నించారా?ఇది ఖరీదైనా అల్పాహార వంటకం కాదు. ఎందుకంటే చికెన్ గ్రేవి, కర్రీ, ఫ్రై వంటివి ఇంట్లో తయారు చేసి తినగా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. దాన్నే ఇలా తయారు చేసుకోవచ్చు. ఉదయం తయారు చేసుకోవడం వల్ల బ్రేక్ ఫాస్ట్ పూర్తి అవుతుంది. చికెన్ కాలీ అవుతుంది. ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి పనిచేసే, జాబ్స్ కు వెళ్లే వారికి అతి త్వరగా బ్రేక్ ఫాస్ట్ రిసిపిని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ సమయం పట్టదు. 15నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. అందుకు చికెన్, దానికి కావల్సిన మసాలాలు, చీజ్ తురుము ఉంటే చాలు

 స్పైసీ చికెన్ తంగ్డి కబాబ్

చికెన్ మాసాంహార రుచిల్లో చాలా పాపులర్. చికెన్ తో చేసే ఏ వంటైనా సరే నోరూరించాల్సిందే. గ్రేవీ, కర్రీ, ఫ్రై, కబాబ్స్ ఇలా... కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. వాటిని ఎంత ఇష్టపడినా ఇంట్లో చేయడం తక్కువే. తంగ్డి చికెన్ కబాబ్ చూడటానికి జ్యూసీగా ప్లేట్ మీల్ లా ఉంటుంది. దీన్ని చూడగానే ఎవ్వరికైనా సరే నోట్లో నీరూరాల్సింది. ఫ్యామిలీ మెంబర్స్ ను, ఫ్రెండ్స్ ను టెంప్ట్ చేసే ఈ చికెన్ తంగ్డి కాబాబ్ మైక్రోవేవ్ తో పాటు వచ్చిన బుక్ లో రెసిపీ చూసి చేసిన ఈ చికెన్ కబాబ్ చాలా బాగా కుదిరింది. మారినేషన్ తయారు చేసుకుంటే చాలు సింపుల్ గా అయిపోతుంది.

లెమన్ జింజర్ గ్రిల్డ్ చికెన్

చికెన్ స్పెషల్ వంటకాల్లో గ్రిల్డ్ చికెన్ చాలా ఫేమస్. ఆల్ టైమ్ హిట్ డిన్నర్. అందులో నిమ్మరసం, అల్లం పేస్ట్ తో తయారు చేసే ఈ గ్రిల్డ్ చికెన్ మరింత టేస్ట్ గా ఉంటుంది. ఈ హెల్తీ చికెన్ వంటకానికి పది మసాలా దినుసులు కూడా పట్టవు. అతి తక్కువ పదార్థలతో తయారయ్యే ఈ చికెన్. అయితే నిమ్మరసం, అల్లంతో తయారు చేసే ఈ గ్రిల్డ్ చికెన్ కు కొంచెం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి చికెన్ ఉంటే చాలు, మిగిలిన పదార్థాలు ఇంట్లో ఎప్పుడూ ఉండేవే కాబట్టి ఎప్పుడైనా సరే గ్రిల్డ్ చికెన్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ గ్రిల్డ్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

English summary

11 Verity Chicken Recipes for Sunday Special | చికెన్ వెరైటీలతో... సండే స్పెషల్


 Enjoy the tempting flavors of allured Indian spices in world famous Non Vegetarian Dishes. Experience the leisure of preparing lip smacking non vegetarian recipes with different methods of preparation. Get detailed information most popular Non Vegetarian delicacies in India
Desktop Bottom Promotion