Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
ఆలూ ఆమ్లెట్: హెల్తీ అండ్ టేస్టీ
ఆలుగడ్డలు కనిపించగానే కరకరలాడే చిప్స్ కళ్లముందు మెదులుతుంటాయి. లేదంటే కమ్మటి వేపుడు గుర్తుకొస్తుంది. టమోట, వంకాయ కూరల్లో రెండు ఆలుగడ్డలు వేసుకోవడం కూడా రొటీనే. ఇంకా ఏం చేసుకోవచ్చు అంటారా... కొంచెం కొత్తగా, వెరైటీగా ఉండే ఆలుగడ్డ మరియు ఎగ్ కాంబినేషన్ తో వెరైటీగా ఒక సైడ్ డిష్ ను రుచికరంగా తయారుచేసుకోవచ్చు.
అదేంటంటే, ఆలూ ఆమ్లెట్. సాధారణంగా ఆమ్లెట్ ను చాలా రకాలుగా వండుతారు. చాలా ఆకలిగా ఉన్నప్పుడు చిటికెలో తయారు చేసుకొని తినగలిగే అల్పాహారం ఎగ్ ఆమ్లెట్. డైయట్ ను పాటించే వాళ్ళు పచ్చసొన ఫాట్, కొలెస్ట్రాల్ శాతం అధికం అనుకొనే వాళ్ళు ఎగ్ వైట్ తో ఆమ్లెట్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యం. అయితే మరింత టేస్టీగా మరిన్ని పోషకాలు, క్యాలరీలు శరీరానికి అందివ్వాలంటే అందులో ఆలూ కూడా జత చేసి ఆమ్లెట్ తయారు చేసుకొని తినొచ్చు. ఇది పిల్లలకూ పెద్దలకూ మంచి పౌష్టికాహారం. అల్పాహారం. మరి ఈ స్పెషల్ సైడ్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం..

ఆలుగడ్డలు: 1/2kg
కోడి గుడ్లు: 5
పాలు: 2tbsp
ఉల్లిపాయలు: 2
మిరియాలపొడి: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
వెన్న: 50grms

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆలుగడ్డల్ని ఉడకబెట్టి తొక్క తీసి ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో కోడి గుడ్ల సొన వేసి బాగా గిలకొట్టాలి.
3. తర్వాత అందులోనే ఉప్పు, మిరియాలపొడి, వెన్న,ఉల్లిపాయ ముక్కలు, పాలు వేసి మళ్లీ గిలకొట్టాలి.
4. చివరిగా ఉడికించిన ఆలుగడ్డ ముక్కల్ని వేసి బాగా కలిపి వెడల్పాటి గిన్నెలో వేసి ఓవెన్‌లో పెట్టి బేక్ చేయాలి. లేదంటే దళసరి పెనంపై ఆమ్లెట్‌లా వేసుకున్నా బాగుంటుంది. అంతే హెల్తీ న్యూట్రీషియన్ ఆలూ ఆమ్లెట్ రెడీ.



Click it and Unblock the Notifications











