చెట్టినాడు చేపల పులావ్

Chettinadu Fish Pulav
కావలసిన పదార్ధాలు:
చేపలు: 1/2kg
పలావ్ రైస్: 1/2kg
కొత్తిమీర: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 2tsp
జీడిపప్పు: 50grms
ఉల్లిపాయలు: 2
ఆయిల్: కావలసినంత
పసుపు: 1tsp
వెన్న: 50grms
మిరియాలు: 50grms
అల్లం వెల్లుల్లి పేస్ట్: తగినంత
గరం మసాలా: సరిపడా

తయారు చేయు విధానము:
1. చేపలను ముళ్ళు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి.
2. చిన్న గిన్నెలో బియ్యాన్ని నీటితో శుభ్రంచేసి బియ్యానికి రెండొంతుల నీరు పోసి అన్నం వండాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు గరం మసాలా ముద్దను అందులో కలపాలి.
3. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి బాగా దోరగా వేయించాలి. అందులో కారం, పసుపు, మసాలా పట్టించిన చేపల ముక్కలను వేసి బాగా రోస్ట్ చేయాలి.
4. ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నంలో ఈ రోస్ట్ చేసిన చేపలను వేసి కలపాలి. చివరగా వెన్నతో వేయించుకున్న జీడిపప్పు, కొత్తిమీర వేసి కలపి పక్కకు దింపుకోవాలి అంతే చిట్టినాడు చేపల పలావ్ రెడీ.

Story first published: Wednesday, May 12, 2010, 16:54 [IST]
Desktop Bottom Promotion