Latest Updates
-
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
చిల్లీ చికెన్ బిట్స్ : వింటర్ స్పెషల్
చిల్లీ చికెన్ బిట్స్ స్పైసి చికెన్ రిసిపి. ఇది ఒక ఫర్ఫెక్ట్ పార్టీ స్నాక్ ఏ కార్యక్రమానికైనా ఈ స్నాక్ ను మీరు తయారుచేసుకోవచ్చు . డ్రింక్స్ తో పాట్ తీసుకొనే మంచి స్నాక్స్ రిసిపి.
చికెన్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నవారు. ఇలాంటి సింపుల్ వంటలను తయారుచేసుకోవచ్చు. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం మరియు చాలా తక్కువ పదార్థాలతో దీన్ని తయారుచేస్తారు. మరి ఈ సింపుల్ అండే టేస్టీ చిల్లీచికెన్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
ఎముకల్లేని చికెన్ ముక్కలు: 300grms
గుడ్డు: 1
మొక్కజొన్న పిండి : 1tbsp
మైదా: 11/2tbsp
ధనియాలపొడి: 1/2tbsp
జీలకర్రపొడి : 1/2tbsp
కారం: 1tsp
మిరియాలపొడి: 1/2tsp
గరం మసాలా: 1/2tsp
నూనె: వేయించడానికి సరిపడా
అల్లం, వెల్లుల్లి ముక్కలు: 1tsp
ఉల్లికాడల తరుగు: 1cup
పచ్చిమిర్చి ముక్కలు: 1tsp
టమోటో కెచప్: 1/2cup
నీళ్ళు: 1cup
ఉప్పు: రుచికి తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా ఓ గిన్నెలో ముక్కలు, గుడ్డుసొన, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, మిరియాలపొడి, మైదా మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు తీసుకుని బాగా కలపాలి.
2. తర్వాత పాన్ లో నూనె తీసుకుని ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
3. ఇప్పుడు మరో బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించాలి.
4. రెండు మూడు నిమిషాల తర్వాత టమోటో కెచప్, ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కల్ని వేసి వేయించాలి. కొద్దిగా నీళ్ళు చల్లి వేయించి రెండు, మూడు నిమషాల తర్వాత దింపేస్తే సరిపోతుంది.



Click it and Unblock the Notifications











