For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ ఆనియన్ పకోడ రిసిపి: ఈవెనింగ్ స్నాక్

|

చాలా మంది క్రిస్పీ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. ఈవెనింగ్ అయ్యే సరికి ఒక కప్పు కాఫీతో పాటు, ఏదైనా వేడివేడి స్నాక్స్ తినాలని కోరుకుంటాం. అందులో క్రీస్పీగా ఉండేవి ఎక్కువగా ఇష్టపడుతారు. సాధారణంగా ఈవెనింగ్ స్నాక్స్ చాలా మంది ఇష్టపడుతారు. అందులో చికెన్ ఆనియన్ పకోడను మరింత ఎక్కువగా ఇష్టపడుతారు.

చికెన్ ఆనియన్ పకోడ చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు. ముఖ్యంగా దీనికి చికెన్ ఉల్లిపాయలతో తయారుచేస్తారు. మరి మీరు కూడా ఈ టేస్టీ ఈవెనింగ్ స్నాన్ రుచి చూడాలంటే, తయారుచేసే పద్దతిని తెలుసుకోవాల్సిందే..

Chicken Onion Pakora Recipe For Evening

కావల్సిన పదార్థాలు:
చికెన్ (ఎముకలు లేనివి) - 200grm(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ వలయాలు -100grm(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4 (సన్నగా తరిగుకోవాలి)
కొత్తిమీర తరుగు 2 కాడలు (తరిగినవి)
శనగ పిండి-1cup
కబాబ్ మసాలా: 1tsp
సోంపు ½ tsp
ఉప్పు : రుచికి సరిపడా
ఆయిల్: 3cups

తయారుచేయు విధానం :
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, కబాబ్ మసాలా మరియు అరకప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.
2. ఉండలు లేకుండా కలిపి శెనగపిండిని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత కలిపి పెట్టుకొన్న శెనగపిండి మిశ్రమంలో పచ్చిమిర్చి, సోంపు, కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
4. చివరగా చికెన్ ముక్కలు మరియు ఉల్లిపాయ రింగ్స్ వేసి బాగా మిక్స్ చేయాలి.
5. అంతలోపు డీప్ బాటమ్ పాన్ స్టౌ మీద పెట్టి నూనె పోసి వేడి చేయాలి.
6. నూనె కాగిన తర్వాత చికెన్ ముక్కలతో పాటు, ఉల్లిపాయముక్కలు చేతి నిండుకూ తీసుకొని కాగేనూనెలో వేయాలి.
7. మీడియం మంట మపెట్టి పకోడాను బ్రౌన్ కలర్ వచ్చే వరకూ అన్ని వైపుల వేయించుకోవాలి.
8. అంతే క్రిస్పీ చికెన్ ఆనియన్ పకోడా రెడీ. వేడి వేడి టీ లేదా కాఫీతో సర్వ్ చేయండి.

English summary

Chicken Onion Pakora Recipe For Evening

No matter how hot it gets outside, Indians never stop eating hot and crispy fried foods. We simply cannot compromise with our steaming cup of tea or coffee in the evening. That is why we also need evening snack recipes that are hot and crispy to go with the cup of hot beverages. Chicken onion pakora is something that you can definitely consider as an evening snack dish.
Story first published: Wednesday, May 14, 2014, 18:17 [IST]
Desktop Bottom Promotion