Latest Updates
-
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు
స్పైసీ చికెన్ రైస్ సూప్ ను ఓ పట్టు పట్టండి...
సాధారణంగా వర్షాకాలమో, శీతాకాలమో వచ్చిందంటే చాలు ఇంట్లో నుండి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టం ఉండదు చాలా మందికి. ఎముకలు కొరికే చల్లగాలిలో బద్దకం. వంటగదిలోకి వెళ్ళడానికి మనసు మారాం చేస్తుంది. చలిగాలికి, వర్షానికి గొంతులోకి కాస్త వేడి వేడిగా టీనో, కాఫీనో... కానీ ఎప్పుడూ అవేనా? సూప్ లు ఉన్నాయి కదా.. ఒక పట్టు పట్టవచ్చు కదా. ఉప్పు, కారం, ఒకటి రెండు కూరగాయలు కలిపి మరిగించి స్పూన్ తో నోటికి అందుకుంటే ఆకలి అందుకుంటుంది. బద్దకం పారిపోతుంది. మూడ్ హుషారవుతుంది. ఇంట్లో ఉత్సాహం అడుగు మోపుతుంది. కూరగాయలతోనే కాకుండా మాంసాహారంతో తయారు చేసే సూప్ లు కూడా చాలా రుచిగా ఉంటాయి. రైస్ సూప్ తో రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. కమ్మనైన రుచి ఘుభాళించే సువాసనతో చికెన్ సూప్ మాంసాహార ప్రియులు రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. తయారు చేయడం కూడా సులభమే. అనారోగ్య కారణంతో నోటికి రుచి తెలియనప్పుడు ఇటువంటి సూప్ లను తయారు చేసుకొని తాగవచ్చు.....

కావలసినవి:
బోన్ లెస్ చికెన్: 300grms
బాస్మతి రైస్: 1/2cup
ఉల్లిపాయ: 1/2cup(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
అల్లం: చిన్న ముక్క(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
కొత్తిమీర: 1cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నిమ్మరసం: 1tbsp
పంచదార: 1tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 2-3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
బట్టర్: 2tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేయాలి. తర్వాత బాస్మతి రైస్ ను కూడా శుభ్రం చేసి కుక్కర్ లో రెండింటిని వేసి తగినన్ని నీళ్ళు పోసి, కొద్దిగా ఉప్పు చేర్చి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో బట్టర్ (వెన్న)సగ భాగం వేసి, తక్కువ మంట మీద కరగనివ్వాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
3. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లం, కొత్తిమీర, నిమ్మరసం, వేసి తక్కువ మంట మీద రెండు నిముషాలు వేయించికోవాలి
4. తర్వాత అందులోనే పంచదార, బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా ఉప్పు వేసి, వేగించాలి.
5. తర్వాత ఉడికించి పెట్టు కొన్ని చికెన్, బియ్యం మిశ్రమాన్నిఫ్రైయింగ్ పాన్ లో పోసి. చిక్కబడేంత వరకూ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేసి మిగిలిన వెన్నను కలిపి క్రిందికి దింపుకోవాలి. అందే చికెన్ రైస్ సూప్ రెడీ.. వేడి వేడిగా సర్వ్ చేయడమే ఆలస్యం....



Click it and Unblock the Notifications











