క్రిస్పీ అండ్ యమ్మీ చికెన్ లాలీపప్: వీకెడ్ స్పెషల్

మాంసాహారంలో మీకు చికెన్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు, ఈ రుచికరమై రిసిపి మీకు టేస్ట్ బడ్స్ ను సాటిస్ ఫై చేస్తుంది. ప్రతి రెస్టారెంట్లోనూ నాన్ వెజ్ మెనులో ఈ చికెన్ లాలీపప్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చికెన్ లాలీపప్ప్ ఎక్కువ మంది ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ జ్యూసీ టెండర్ చికెన్ రిసిపిని కొన్ని ఇండియన్ మాసాల దినుసులతో మ్యారినేట్ చేసి, తయారుచేస్తారు.

చికెన్ లాలీపప్ ను డిఫరెంట్ స్టైల్లో తయారుచేస్తారు. అందుకే చాలా మంది ఈ టేస్ట్ ను అమితంగా ఇష్టపడుతారు. ఆ డిఫరెంట్ స్టైల్ ను మీరు ఇంట్లో ప్రయత్నించాడానికి బోల్డ్ స్కై.కామ్ చికెన్ లాలీపప్ రిసిపిని ఎలా తయారుచేయాలో అందిస్తోంది. దీన్ని లంచ్, డిన్నర్ ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూడండి...\

Crispy and Yummy Chicken Lollipop

కావల్సిన పదార్థాలు
చికెన్: 12 ముక్కలు
ఉల్లిపాయ: 4tsp(పేస్ట్)
వెల్లుల్లి: 1tsp(పేస్ట్)
అల్లం: 1 tsp(పేస్ట్)
పెప్పర్ పౌడర్: 1tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా

పిండికలుపుకోవడానికి కావలసినవి
మొక్కజొన్న పిండి: 3tbsp
మైదా: 2tbsp
బేకింగ్ సోడా: చిటికెడు
ఆయిల్: 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా మీరు చికెన్ లాలీపప్స్ ను శుభ్రంగా కడిగి, దాని మీద పసుపు, ఉప్పు చిలకరించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో ఉల్లిపాయ పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ మిశ్రమానికి పెప్పర్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు ఈ పేస్ట్ ను ఉపయోగించి చికెన్ లాలీపప్పుకు ఫుల్ గా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి. 4. మరో బౌల్లో, కార్న్ ఫ్లోర్, మరియు మైద, బేకింగ్ సోడా, ఉప్పు మరియు నీళ్ళు పోసి, చిక్కగా కలిపి పెట్టుకోవాలి.
5. తర్వాత ఈ చిక్కటి పిండిని మ్యారినేట్ చేసిన చికెన్ లాలీపప్స్ కు మ్యారినేట్ చేయాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలకు పట్టించిన తర్వాత మరో 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి
6. నూనె వేడి అయ్యాక, చికెన్ లాలీపప్స్ ను ఫ్రైయింగ్ పాన్ లో వేసి ఫ్రై చేయాలి . అన్ని అవైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ తిప్పుతూ పూర్తిగా ఫ్రై చేయాలి.
7. చికెన్ లాలీపప్ప్ గోల్డ్ బ్రౌన్ కలర్ లోనికి మారుతున్నప్పుడు, ఆయిల్ నుండి చికెన్ తీసి, ఆయిల్ పీల్చుకొనే పేర్ మీద వేయాలి. అంతే మీ చికెన్ లాలీపప్స్ రెడీ . 8. ఈ రుచికరమైన చికెన్ లాలీపప్ప్ ను చైనీస్ ఫ్రైడ్ రైస్ తో తినాలి. మరింత స్పైసీ టేస్ట్ కోరుకుంటున్నట్లైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి మీర అందించాలి.

Story first published: Friday, April 29, 2016, 13:30 [IST]
Desktop Bottom Promotion