For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ బాంగ్రా ఫిష్ రసం రిసిపి : వీకెండ్ స్పెషల్

|

చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి శరీరానికి చాలా అవసరం . అంతే కాదు చేపల్లో ప్రోటీన్స్ కూడా అధికమే. అయితే ఫ్యాట్ తక్కువ . అందుకే మన రెగ్యులర్ డైట్ కు ఇది చాలా అవసరం . కాబట్టి, చేపలను ఏదో ఒక రూపంలో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఈరోజు మీకోసం ఒక ఈజీ అండ్ స్పెషల్ బాంగ్రా ఫిష్ రసం రిసిపిని పరిచయం చేయడం జరిగింది. ఈ రిసిపి తయారుచేయడానికి చాలా తక్కవు సమయం పడుతుంది. ఈ వంట కేరళ మరియు మ్యాంగళూర్లలో చాలా ఫేమస్ వంట. . ఇది మంచి టేస్ట్ ను అందివ్వడం మాత్రమే కాదు కార్డియో వ్యాస్కులర్ మరియు బ్లడ్ క్లాటింగ్ సమస్యలను నివారిస్తుంది . ఫిష్ ను రెగ్యులర్ గా తినడం వల్ల డిప్రెషన్ తగ్గిస్తుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Bangra Fish Rasam Recipe

బంగ్రా ఫిష్(ఇండియన్ మకరైల్) - 4
ఉల్లిపాయల ముక్కలు - 1 cup
టమోటో ముక్కలు - 1 cup
కారం - 1/2 teaspoon
ధనియాలపొడి - 1/2 teaspoon
ఎండుమిర్చి - 5
జీలకర్ర - 1/4th teaspoon
ఆవాలు - 1/4th teaspoon
పసుపు - 1/4th teaspoon
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: తగినంత

1. ముందుగా చేపలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, మరియు టమోటోలు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. టమోటో మరియు ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోయాలి.
4. పోపు బాగా ఉడుకుతున్న సమయంలో అందులో చేపముక్కలు వేసి, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
5.చేపముక్కలు మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి. అంతే బాంగ్ర ఫిష్ రసం రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Easy Tasty Bangra Fish Rasam Recipe

Fishes are rich in omega-3 fatty acids that are very important for our body. It is also rich in proteins and is low on fats. Hence, it is an essentail part of our diet and needs to be included in our diet in one or the other form.
Story first published: Saturday, December 5, 2015, 12:41 [IST]
Desktop Bottom Promotion