హెల్తీ గార్లిక్ గ్రిల్డ్ ఫిష్..

Garlic Grilled Fish
వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటుంటారు పెద్దలు. అది నిజం. నేచర్ స్రుష్టించిన నికార్సయిన మెడిసిన్ ఇది. నేరుగా తినేవాళ్ళు బుద్ధిమంతులు. అలా కాకుండా వెల్లుల్లి తినని వారికి మరో ప్రత్యామ్నాయంగా వివిధరకాలుగా ఉపయోగించి పెట్టవచ్చు. వెల్లుల్లి రైస్. వెల్లుల్లి చారు, వెల్లుల్లి ఫి ఇలా. మరియు వెల్లుల్లి ఉపయోగించి ఫిష్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం....

కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ ఫిష్ ముక్కలు: 4(పెద్దవి)
ఉల్లిపాయ: 1(గుండ్రంగా కట్ చేసుకోవాలి)
టమోటో:1 (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తరగు: 2tbsp
నిమ్మకాయ: 1(సగభాగాన్ని కట్ చేసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి)
మయోనైజ్ : 1tps(మార్కెట్లో లభిస్తుంది)
అల్యూమినియం ఫాయిల్: 1
ఉప్పు, కారం,మిరయాల పొడి, వెల్లుల్లి పొడి: తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా చేప ముక్కలను, ఉప్పు, పసుపు వేసి శుభ్రపరిచి, నీళ్లన్నీ పోయేవరకు ఉంచాలి. తర్వాత వీటికి రాయాలి.
2. ఆ తర్వాత వెల్లుల్లి పొడి, ఉప్పు, మిరియాల పొడి రాయాలి. (పొడి రాకపోతే వెల్లుల్లి రెబ్బలు,ఉప్పు, మిరియాలను మిక్స్ లో వేసి పేస్ట్ చేసుకొని రాయచ్చు ).
3. ఐదు నిముషాల తర్వాత దాని మీద యయోనైజ్ పూయాలి. అల్యూమినియం ఫాయిల్ ను పెద్దగా, చేప ముక్కలు పట్టేంతగా కట్ చేసుకొని, మధ్యలో పెట్టి, పైన ఉల్లిపాయ ముక్కలు పెట్టాలి.
4. ఆపైన గుండ్రంగా తరిగిన టొమాటో ముక్కలు పెట్టి, ఉప్పు మిరియాల పొడి చల్లాలి. తర్వాత పైన ఇచ్చిన ఇతర కూరగా ముక్కలు, కొత్తిమీర వేసి చేప ముక్క కదలకుండా ఫాయిల్ ని దగ్గరకు చుట్టి, చివరలు మూసేయాలి. అవెన్ లో 375డిగ్రీల పెంటిగ్రేడ్ లో పది నిముషాలు కుక్ చేసి, తీయాలి. పాయిల్ తీసి, ఆలివ్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. గార్లిక్ గ్రిల్డ్ ఫిష్ ను స్టౌ మీద గ్రిల్ చేసినా, అవెన్ లో కుక్ చేసినా, ఫాయిల్ కాలిపోకుండా జాగ్రత్త పడాలి.

Story first published: Saturday, October 6, 2012, 13:31 [IST]
Desktop Bottom Promotion