గార్లిక్ రెడ్ చికెన్ గ్రేవీ రిసిపి

Posted By:
Subscribe to Boldsky

మాంసాహార ప్రియులకు చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్ తో వివిధ రకాల వంటలు వండుకుని తింటుంటారు. ముఖ్యంగా వీకెండ్స్ లో ప్రయోగాలు చేయడం ఏదో ఒక కొత్త రుచిని ఆస్వాదించడం వీరి హాబి. అయితే అలాంటి వారిలో మీరు ఒకరైతే మీకోసం ఒక స్పెషల్ చికెన్ రిసిపిని పరిచయం చేస్తున్నాం.

చాలా సింపుల్ రిసిపి. అంతే కాదు, టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఆ రిసిపి ఏంటంటే గార్లిక్ చికెన్ రిసిపి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, ఈ వంట ఒక పవర్ ప్యాక్ డిస్ గా రుచితో పాటు, ఆరోగ్యాన్ని అందిస్తుంది.

గార్లిక్ చికెన్ కాంబినేషన్ రిసిపిని మీరు ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ వంటకు కావల్సిన పదార్థాలేంటి, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

Garlic Red Chicken Gravy Recipe

కావల్సిన పదార్థాలు:

  • చికెన్: 1kg శుభ్రం చేసినది
  • కుకింగ్ ఆయిల్: 2 tbsp
  • బటర్: 1 tbs
  • ఉల్లియపా: 1
  • ఎండు మిర్చి : 15
  • వెల్లులి రెబ్బలు: 10
  • పెరుగు: 1 కప్పు
  • పసుపు: 1 tbsp
  • ఉప్పు: రుచికి సరిపడా
  • జీలకర్ర: 1tbsp

తయారుచేయు విధానం :

1. రెడ్ గార్లిక్ చికెన్ తయారుచేయడానికి ముందుగా ఎండు మిర్చి, వెల్లుల్లిని వేడి నీటిలో వేసి కొద్ది సమయం నానబెట్టాలి.

2. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి, పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ ను స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్ద్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

4. తర్వాత అందులోనే చికెన్, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నప్పుడు, ముందు గా మిక్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా అందులో వేసి కొద్ది నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

5. ఇప్పుడు అందులో పెరుగు, జీలకర్ర వేసి మిక్స్ చేయాలి. సరిపడా నీళ్ళు కలిపి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

6. తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి, విజిల్ పెట్టి..రెండు, మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో హాట్ రెడ్ గార్లిక్ చికెన్ గ్రేవీని సర్వ్ చేయాలి.

English summary

Garlic Red Chicken Gravy Recipe

Garlic Red Chicken gravy is the easiest chicken recipe to prepare, which can be done within few minutes. Though it requires only two main ingredients to prepare, it tastes so tasty and yummy. Just try it out. Serve Garlic Red Chicken Gravy along with Steamed Rice or a Garlic Naan for a weekday meal.
Story first published: Saturday, July 8, 2017, 12:07 [IST]
Subscribe Newsletter