జింజర్ గార్లిక్ గ్రిల్డ్ ఫిష్

Ginger Garlic Grilled Fish
కావలసిన పదార్థాలు:
చేపముక్కలు: 6-10(ముళ్ళుఎముకలు లేనివి)
అల్లం తురుము: 2tbsp
వెల్లుల్లి రెబ్బలు: 6-8(పొట్టుతీసి చిదిమినవి)
వంటకాల్లో వాడే బ్రౌన్ షుగర్: 3tsp
సోయాసాస్: 1/2cup
సాకి: 1cup(జపనీస్ రైస్ వైస్/లేదా రైస్ నానబెట్టి పేస్ట్ చేసుకోవచ్చు)

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్లో సాకి, సోయాసాస్, అల్లం తురుము, వెల్లుల్లి, బ్రౌన్ షుగర్ తీసుకుని బాగా కలిపితే చేపలకు పట్టించే విధంగా మసాలా ముద్ద(పేస్ట్)రెడీ అవుతుంది.
2. ఈ మసాలా ముద్దనుండి పావు బాగం తీసి సపరేటుగా పెట్టుకోవాలి.
3. ఇప్పుడు చేపముక్కల్ని చల్లని నీటితో శుభ్రంగా కడిగి వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని పైన రెడీ చేసిపెట్టుకొన్న మసాలా ను చేపముక్కలకు అంటించి నాలుగు గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
4. నాలుగంటల తర్వాత చేపముక్కలను బయటకు తీసి గ్రిల్ పై కాల్చాలి. లేదా మైక్రోవోవెన్ లో గ్రిల్ గుచ్చి ఒక నిమిషం పాటు బేక్ చేసి బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇలా బేక్ చేసిన చేపముక్కలపై ముందుగా మిగిల్చిన పావుబాగం మసాలాను చేపముక్కలపై పూసి వెల్లుల్లి రేకులు గార్నిష్ చేసి అన్నంతో పాటు సర్వ్ చేయాలి. అంతే గ్రిల్డ్ ఫిష్ రెడీ...

Story first published: Monday, April 16, 2012, 18:37 [IST]
Desktop Bottom Promotion